Chevireddy Bhaskar Reddy : ఛాతీ నొప్పితో విజయవాడ ఆసుపత్రికి చెవిరెడ్డి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోగ్యం విషమించడంతో జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు.
- By Kavya Krishna Published Date - 05:37 PM, Sat - 21 June 25

Chevireddy Bhaskar Reddy : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆరోగ్యం విషమించడంతో జైలు నుంచి ఆసుపత్రికి తరలించారు. మద్యం కుంభకోణం కేసులో రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైలులో ఉన్న చెవిరెడ్డికి శనివారం ఉదయం ఛాతీలో నొప్పి రావడంతో జైలు అధికారులు అత్యవసరంగా స్పందించి మొదట జైలు వైద్యులు పరీక్షించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం ఆయనను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Nitish Kumar: అసెంబ్లీ ఎన్నికల ముందు పింఛన్‌ల సీఎం నీతీశ్ కుమార్ పై కీలక నిర్ణయం
అక్కడి ఫిజియోథెరపీ విభాగంలో చెవిరెడ్డికి పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు తెలిపారు. సాయంత్రం వరకు వైద్యుల పర్యవేక్షణలో ఉంచి, అనంతరం తగిన చికిత్స తరువాత డిశ్చార్జ్ చేసి తిరిగి జైలుకు తరలించే అవకాశం ఉందని సమాచారం.
ఇక మరోవైపు, చెవిరెడ్డి కస్టడీ కోసం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) శుక్రవారం విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఐదు రోజుల కస్టడీ మంజూరు చేయాలని కోరింది. ఇదే సమయంలో చెవిరెడ్డి తరఫు న్యాయవాదులు బెయిల్ మంజూరు చేయాలని, జైలు భోజనం తినలేకపోతున్నందున ఇంటి నుంచే భోజనం తీసుకురావడానికి అనుమతించాలని కోర్టును అభ్యర్థించారు. ఈ పిటిషన్లపై ఈ నెల 23న ఏసీబీ కోర్టు విచారణ జరపనుంది.
Sonia Gandhi : ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంపై కేంద్రం మౌనం : సోనియా గాంధీ విమర్శలు