HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Yashasvi Jaiswal To Switch From Mumbai To Goa

Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ షాకింగ్ నిర్ణ‌యం.. ముంబై నుంచి గోవాకు!

భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ వచ్చే సీజన్‌లో గోవా తరపున దేశీయ క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. అంతేకాకుండా అతన్ని గోవా కెప్టెన్‌గా కూడా నియమించే అవకాశం ఉంది.

  • Author : Gopi Date : 03-04-2025 - 8:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
ICC Test Rankings
ICC Test Rankings

Yashasvi Jaiswal: భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) వచ్చే సీజన్‌లో గోవా తరపున దేశీయ క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడు. అంతేకాకుండా అతన్ని గోవా కెప్టెన్‌గా కూడా నియమించే అవకాశం ఉంది. 23 ఏళ్ల ఈ భారత ఓపెనర్ యశస్వి ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) నుంచి నో-ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) కోరాడు. MCA అధికారి ఒకరు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. అవును అతని (జైస్వాల్) ఈ నిర్ణయం ఆశ్చర్యకరంగా ఉంది. కానీ అతను ఏదో ఆలోచించి ఉంటాడు. అతను తనను విడుదల చేయాలని కోరాడు. MCA జైస్వాల్ డిమాండ్‌ను అంగీకరించింది అని వివరించాడు.

జైస్వాల్ ముంబై తరపున చివరి మ్యాచ్ జనవరి 23 నుంచి 25 వరకు రంజీ ట్రోఫీలో జమ్మూ అండ్ కాశ్మీర్‌తో ఆడాడు. ఆ మ్యాచ్‌లో జైస్వాల్ 4, 26 పరుగులు చేశాడు. గోవా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి శాంభ దేశాయ్ మాట్లాడుతూ.. అతను మా కోసం ఆడాలని కోరుకుంటున్నాడు. మేము అతన్ని స్వాగతిస్తున్నాము. జైస్వాల్‌ను కెప్టెన్‌గా నియమించే అంశంపై దేశాయ్ స్పందించారు. అవును, అది జరగొచ్చు. అతను భారత జట్టు కోసం ఆడుతున్నాడు. అతను జాతీయ విధుల్లో లేనప్పుడు.. దేశీయ క్రికెట్‌కు అందుబాటులో ఉన్నప్పుడు అతన్ని కెప్టెన్‌గా నియమిస్తారు అని తెలిపారు.

Also Read: Waqf Bill: లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లు ఆమోదం.. అనుకూలంగా, వ్యతిరేకంగా ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా?

ముంబైని వదిలి గోవాకు వెళ్లే మూడో ఆటగాడు జైస్వాల్

యశస్వి జైస్వాల్ ముంబైని వదిలి గోవా తరపున ఆడే మూడో క్రికెటర్‌గా నిలిచాడు. అతనికి ముందు అర్జున్ టెండూల్కర్, సిద్ధార్థ్ లాడ్ గోవా తరపున ఆడారు. టెండూల్కర్, లాడ్ 2022-23 సీజన్‌లో గోవా తరపున ఆడారు. ఆ తర్వాత సిద్ధార్థ్ ముంబైకి తిరిగి వచ్చాడు. అతను కూలింగ్ పీరియడ్‌లో కూడా ఉన్నాడు.

భారత్ కోసం 19 మ్యాచ్‌లు ఆడిన జైస్వాల్

యశస్వి జైస్వాల్ జులై 2023లో వెస్టిండీస్‌తో టెస్ట్ అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఓపెనర్‌గా మొదటి ఎంపికగా కొనసాగుతున్నాడు. జైస్వాల్ అరంగేట్రం తర్వాత భారత్ కోసం 19 మ్యాచ్‌లు ఆడాడు. పెద్ద వేదికపై అద్భుత ప్రదర్శన చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో అతని సగటు 52 కంటే ఎక్కువగా ఉంది. ఈ ఫార్మాట్‌లో భారత్ కోసం ఆడుతూ నాలుగు శతకాలు, 10 అర్ధ శతకాలు సాధించాడు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Domestic Cricket
  • Goa Cricket Team
  • Mmubai Cricket Team
  • sports news
  • yashasvi jaiswal

Related News

Jofra Archer

షమీ రికార్డును సమం చేసిన ఆర్చర్!

జోఫ్రా ఆర్చర్ అద్భుతంగా రాణించినప్పటికీ ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. కేకేఆర్ జట్టులో రింకూ సింగ్, అనుకుల్ రాయ్‌లు విజయంలో కీలక పాత్ర పోషించారు.

  • Smriti Mandhana created history by surpassing Rohit Sharma to become India's leading T20I run scorer

    Smriti Mandhana: విరాట్ కోహ్లీ, రోహిత్ లను అధిగమించి స్మృతి మంధాన రికార్డ్ ..!

  • Virat Kohli

    నేడు ఢిల్లీతో ఆర్సీబీ ఢీ.. ఇంపాక్ట్ ప్లేయ‌ర్‌గా కోహ్లీ?

  • Gerald Coetzee

    స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టులో భారీ మార్పు!

  • Ajinkya Rahane

    వరుసగా ఐదో ఓటమిపై అజింక్య రహానే ఆవేదన!

Latest News

  • బీజేపీ మాజీ ఎంపీ మృతి.. పీఎం మోదీ సంతాపం

  • అజింక్యా ర‌హానే ఖాతాలో మ‌రో చెత్త రికార్డు!

  • హోర్ముజ్ జలసంధి నుండి బ‌య‌ట‌ప‌డిన భార‌త నౌక‌!

  • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

  • టీమిండియా ఖాతాలో మ‌రో ఓట‌మి!

Trending News

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

    • ఎల్లుండి ఇరాన్- అమెరికా మధ్య చర్చలు?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd