WTC Final: చివరి పంచ్ మనదేనా..? గెలిస్తే WTC ఫైనల్ బెర్త్
పిచ్‌పైనే ఎక్కువ చర్చ జరుగుతున్న వేళ మ్యాచ్ చేజారితే సిరీస్ సాధించే అవకాశాన్ని కోల్పోయినట్టే. మరోవైపు ఇండోర్‌లో భారత్ నిలువరించిన ఆసీస్ ఇప్పుడు
- By Naresh Kumar Published Date - 07:55 PM, Wed - 8 March 23

వరుసగా రెండు టెస్టుల్లోనూ పైచేయి.. కట్ చేస్తే మూడో టెస్టులో షాక్..ఫలితంగా ఇటు సిరీస్ , అటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ బెర్త్ సాధించడంపై సస్పెన్స్.. ఇలాంటి పరిస్థితుల్లో అహ్మదాబాద్ వేదికగా చివరి మ్యాచ్‌కు సిద్ధమైంది టీమిండియా. పిచ్‌పైనే ఎక్కువ చర్చ జరుగుతున్న వేళ మ్యాచ్ చేజారితే సిరీస్ సాధించే అవకాశాన్ని కోల్పోయినట్టే. మరోవైపు ఇండోర్‌లో భారత్ నిలువరించిన ఆసీస్ ఇప్పుడు చివరి మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్ సమం చేయాలని భావిస్తోంది.
ఇండోర్ టెస్టులో ఆస్ట్రేలియా విజయంతో రసవత్తరంగా మారిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ముగింపు అహ్మదాబాద్‌కు షిప్ట్ అయింది. ప్రస్తుతం టీమిండియా సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో ఉన్న భారత్ నాలుగో టెస్టులోనూ గెలిచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకోవాలని పట్టుదలగా ఉంది. స్పిన్ వ్యూహంతో తొలి రెండు మ్యాచ్‌లలోనూ గెలిచిన రోహిత్‌సేన.. అనూహ్యంగా ఇండోర్‌లో పరాజయం పాలైంది. స్పిన్ పిచ్‌పై మవ బ్యాటర్లు చేతులెత్తేయడంతో ఆసీస్ ఘనవిజయం సాధించింది. దీంతో నాలుగో టెస్టులో గెలిచినా, డ్రా చేసుకున్నా సిరీస్ భారత్‌కే దక్కుతుంది. అయితే మ్యాచ్ డ్రాగా ముగిస్తే మాత్రం సిరీస్ గెలిచినా… వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ బెర్త్ మాత్రం లంక,న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ ఫలితంపై ఆధారపడి ఉంటుంది. ఇదిలా ఉంటే తొలి రెండు టెస్టుల్లోనూ ఆసీస్‌ను చిత్తు చేసిన టీమిండియా బ్యాటర్ల వైఫల్యంతోనే ఇండోర్‌లో ఓడిపోయింది. టాపార్డర్‌లో ఓపెనర్లతో పాటు విరాట్ కోహ్లీ ఫామ్ అందుకోవాల్సి ఉండగా..మిగిలిన బ్యాటర్లూ రాణించకుంటే భారీస్కోర్ చేయడం కష్టమే.
తుది జట్టులో వికెట్ కీపర్ శ్రీకర్ భరత్‌పై వేటు పడే అవకాశముంది. అతని స్థానంలో ఇషాన్ కిషన్‌ను ఆడించనున్నట్టు తెలుస్తోంది. కేఎస్ భరత్ గత మూడు మ్యాచ్‌ల్లో ఐదు ఇన్నింగ్స్‌లు ఆడి 57 పరుగులు మాత్రమే చేశాడు. కీపర్‌గా అదరగొడుతున్నా బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. అయితే అహ్మదాబాద్ వికెట్‌లో అంతగా టర్న్ లేకుంటే ఇషాన్ కిషన్‌ను ఆడించాలని టీమ్‌మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అటు బౌలింగ్ పరంగానూ మార్పులు జరగనున్నాయి. సిరాజ్‌కు విశ్రాంతినిచ్చి షమీని తీసుకోనుండగా…సూర్యకుమార్‌ను తప్పించి పేసర్ ఉమేశ్ యాదవ్‌ను ఆడించే అవకాశముంది. అయితే ఈ మ్యాచ్‌కు ఎలాంటి పిచ్ రెడీ చేసారన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. మూడు టెస్టుల్లోనూ స్పిన్ పిచ్‌లే కావడంతో విమర్శలు వస్తున్న వేళ అహ్మదాబాద్‌పై బీసీసీఐ , టీమ్ మేనేజ్‌మెంట్ ఎటువంటి సూచనలు చేయలేదని సమాచారం.
అయితే అహ్మదాబాద్ క్యురేటర్లు మాత్రం ఈ మ్యాచ్ కోసం రెడ్ సాయిల్, బ్లాక్ సాయిల్ పిచ్‌లను సిద్ధం చేశారు. పిచ్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు బయటికొచ్చినా..ఫైనల్ పిచ్ ఏదో క్లారిటీ లేకపోవడంతో ఎలాంటి వ్యూహం అనుసరించాలన్న దానిపై ఆసీస్ ఒక నిర్ణయం తీసుకోలేకపోతోంది. మరోవైపు ఇండోర్‌లో విజయంతో కాన్ఫిడెన్స్ పెరిగిన ఆసీస్ సిరీస్ సమం చేసే అవకాశాం చేజార్చుకోకూడదని పట్టుదలగా ఉంది. కాగా ఈ మ్యాచ్‌కు ఇరు దేశాల ప్రధానమంత్రులూ ప్రత్యేక అతిథులుగా హాజరుకానున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్‌తో కలిసి మోదీ మ్యాచ్‌ను వీక్షించనున్నారు.
Also Read: Avatar 2: అవతార్ 2 డిజిటల్ రిలీజ్ డేట్ వచ్చేసింది!

Tags
- ahmedabad
- Aim
- australia
- batting
- BCCI
- cricket
- Eye
- final
- Grabs
- ICC
- Improved
- india
- Match
- rohit sharma
- series
- Show
- Spot
- Stalemate
- WTC

Related News

WPL Final: తొలి టైటిల్ చిక్కేదెవరికి? ఢిల్లీ, ముంబై మధ్య ఫైనల్ ఫైట్
మహిళల ఐపీఎల్ తొలి సీజన్ ఫైనల్ కు కౌంట్ డౌన్ మొదలైంది. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ మధ్య టైటిల్ పోరు జరగబోతోంది.