India Women Win Asia Cup: ఆడవాళ్లు మీకు జోహార్లు.. మహిళల ఆసియా కప్ మనదే!
మహిళల ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక మహిళల
- By Gopichand Published Date - 03:40 PM, Sat - 15 October 22

మహిళల ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత మహిళల జట్టు ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక మహిళల జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 65 పరుగులు మాత్రమే చేయగలిగింది. శ్రీలంక మహిళల బ్యాటింగ్ లో రణవీర (18 నాటౌట్)గా నిలిచింది. శ్రీలంక బ్యాటింగ్ లో రణవీర టాప్ స్కోరర్ గా నిలిచింది. భారత మహిళల బౌలింగ్ లో రేణుకాసింగ్ 5 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. గయక్వాడ్, స్నేహ్ రానా చెరో 2 వికెట్లు తీశారు.
66 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు 8.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ బ్యాటింగ్ లో స్మ్రితి మందాన (51 నాటౌట్), హర్మన్ ప్రీత్ కౌర్ (11 నాటౌట్) పరుగులు చేశారు. భారత మహిళల జట్టు 8.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసి ఘన విజయం సాధించింది. అయితే శ్రీలంకను ఫైనల్లోభారత్ ఓడించటం ఇది 5వ సారి కావడం విశేషం.
నెల క్రితం రోహిత్ సేన చేయలేని పనిని, హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో మహిళా టీమ్ చాలా ఈజీగా చేసి చూపించింది. ఆసియా కప్ 2022 ఫైనల్‌లో లంకను 8 వికెట్ల తేడాతో చిత్తు చేసి ఆరో సారి ఆసియా కప్‌ని కైవసం చేసుకుంది. గత ఎడిషన్ ఫైనల్‌లో మిస్ అయిన ఆసియా కప్ టైటిల్ మళ్లీ భారత మహిళల ఖాతాలోనే చేరింది. 8 ఎడిషన్లలో ఏడు సార్లు భారత మహిళా జట్టే విజేతగా నిలవడం విశేషం.
𝐖𝐇𝐀𝐓. 𝐀. 𝐖𝐈𝐍! 👏 👏
Clinical performance from #TeamIndia as they beat Sri Lanka to win the #AsiaCup2022 title! 🙌 🙌 #INDvSL
Scorecard ▶️ https://t.co/r5q0NTVLQC
📸 Courtesy: Asian Cricket Council pic.twitter.com/C61b4s1Hc2
— BCCI Women (@BCCIWomen) October 15, 2022