India vs South Africa Final: నేడు టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్.. పొంచి ఉన్న వర్షం ముప్పు..!
- By Gopichand Published Date - 08:24 AM, Sat - 29 June 24

India vs South Africa Final: టీ20 ప్రపంచకప్ 2024లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య బార్బడోస్‌లో చివరి మ్యాచ్ (India vs South Africa Final) జరగనుంది. ప్రపంచకప్ ఫైనల్‌లో ఇరు జట్లు తొలిసారి తలపడనున్నాయి. ఐసీసీ T20 ప్రపంచ కప్ చివరి తేదీని జూన్ 29గా ఉంచినప్పటికీ.. నివేదికల ప్రకారం ఫైనల్ మ్యాచ్ ఈ రోజు కాదు అంటే జూన్ 29న కాకుండా జూన్ 30 న నిర్వహించే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణం వెలుగులోకి వచ్చింది.
ఫైనల్‌కు వర్షం ముప్పు
ఈ T20 ప్రపంచ కప్ 2024 టోర్నమెంట్ ప్రారంభం నుండి వర్షం ఆటంకంగా మారింది. వర్షం కారణంగా పలు లీగ్ మ్యాచ్‌లు కూడా రద్దయ్యాయి. దీంతో పాటు సెమీ ఫైనల్‌లోనూ వర్షం కనిపించింది. ఫైనల్ మ్యాచ్‌పైనా వర్షం ముప్పు పొంచి ఉంది. భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగే ఫైనల్ మ్యాచ్‌లో 78 శాతం వర్షం కురిసే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. అయితే ఫైనల్ మ్యాచ్‌కు ఐసీసీ రిజర్వ్ డేని కూడా ఉంచింది.
Also Read: T20 World Cup 2024 Final: హైఓల్టేజ్ మ్యాచ్ లో టీమిండియా vs సౌతాఫ్రికా
రిజర్వ్ రోజున ఫైనల్ నిర్వహించవచ్చు
బార్బడోస్‌లో భారీ వర్షం కురిసిన అనేక వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. బార్బడోస్‌లో గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వర్షం కారణంగా ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరగకపోతే జూన్ 30న రిజర్వ్ డే రోజున ఈ మ్యాచ్ జరగనుంది. నిజానికి ఐసీసీ ఫైనల్ మ్యాచ్ కోసం ప్రత్యేక నిబంధనలను రూపొందించింది. ఫైనల్ మ్యాచ్ కోసం 190 నిమిషాలు అదనంగా ఉంచారు. అంటే మ్యాచ్‌కు ముందు వర్షం కురిస్తే 190 నిమిషాల పాటు వెయిట్, ఆ తర్వాత కూడా వర్షం ఆగకపోతే ఓవర్లలో కోత మొదలవుతుంది.
We’re now on WhatsApp : Click to Join
ట్రోఫీపైనే టీమిండియా చూపు
ఈ టోర్నీలో భారత జట్టు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోలేదు. మరోవైపు ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా కూడా అజేయంగా ఉంది. టీ20 ప్రపంచకప్‌లో మూడోసారి ఫైనల్‌కు టీమ్‌ఇండియా చేరుకోగా.. తొలిసారిగా దక్షిణాఫ్రికా టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరింది. 2007లో తొలిసారిగా టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఇప్పుడు రోహిత్ శర్మ సారథ్యంలో భారత జట్టు రెండోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని గెలవాలనుకుంటోంది.