T20 World Cup 2024 Final: హైఓల్టేజ్ మ్యాచ్ లో టీమిండియా vs సౌతాఫ్రికా
టి20 ప్రపంచ కప్ టైటిల్ మ్యాచ్ లో టీమిండియా, సౌతాఫ్రికా జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. తొలి టి20 ప్రపంచకప్ లో భారత్ పాకిస్థాన్ పై గెలిచి టైటిల్ అందుకుంది. ఆ తర్వాత భారత్ కి మరో టైటిల్ దక్కలేదు. అటు సౌత్ప్రికా జట్టుకు టి20 ప్రపంచకప్ అందని ద్రాక్షగానే మిగులుతుంది.
- Author : Praveen Aluthuru
Date : 28-06-2024 - 11:03 IST
Published By : Hashtagu Telugu Desk
T20 World Cup 2024 Final: టి20 ప్రపంచ కప్ టైటిల్ మ్యాచ్ లో టీమిండియా, సౌతాఫ్రికా జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. తొలి టి20 ప్రపంచకప్ లో భారత్ పాకిస్థాన్ పై గెలిచి టైటిల్ అందుకుంది. ఆ తర్వాత భారత్ కి మరో టైటిల్ దక్కలేదు. అటు సౌత్ప్రికా జట్టుకు టి20 ప్రపంచకప్ అందని ద్రాక్షగానే మిగులుతుంది.
ఇప్పటివరకు సౌతాఫ్రికా ఒక్కసారి కూడా ఫైనల్ కు చేరుకోలేకపోయింది. టీమిండియా మూడోసారి ఫైనల్ మ్యాచ్ ఆడబోతుంది. మరి ఈ హైఓల్టేజ్ మ్యాచ్ లో ఏ జట్టు గెలిచి టైటిల్ ఎగురేసుకుపోతుందో చూడాలి. భారత్ మరియు దక్షిణాఫ్రికా జట్లు రేపు జూన్ 29న బార్బడోస్‌లో తలపడతాయి. అయితే ఫైనల్ మ్యాచ్ కి వర్షం ముప్పు ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బార్బడోస్ లో రేపు వర్షం పడే అవకాశం ఉంది. జూన్ 29న ఉదయం 74%, రాత్రి 42% వర్షం పడే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వర్షం ఈ మ్యాచ్‌పై ప్రభావం చూపుతుంది. అయితే ఐసీసీ ఫైనల్ మ్యాచ్‌కు జూన్ 30ని రిజర్వ్ డేగా ప్రకటించింది. జూన్ 29న భారత్-దక్షిణాఫ్రికా మ్యాచ్ జరగకపోతే జూన్ 30న ఈ మ్యాచ్ జరుగుతుంది. ఆ రోజు కూడా వర్షం పడి మ్యాచ్ రద్దయితే ఐసీసీ నిబంధనల ప్రకారం ఇరు జట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటిస్తారు.
ఇకపోతే ఈ మ్యాచ్ ఫ్యాన్స్ ని కచ్చితంగా ఉర్రుతలూగిస్తుంది. ఎందుకంటే ఇరు జట్లు బలంగా కనిపిస్తున్నాయి. సౌతాఫ్రికా ఆటగాళ్లు రీజా హెండ్రిక్స్, కెప్టెన్ మార్క్రామ్, క్వింటన్ డి కాక్ మరియు హెన్రిచ్ క్లాసెన్ లకు వేగంగా పరుగులు చేయగలరు. రబడ, ఎన్రిక్ నోర్కియా, మార్కో జాన్సన్, తబ్రేజ్ షమ్సీలు బౌలింగ్‌లో విధ్వంసం సృష్టించగలరు. టీమిండియాలో విరాట్ కోహ్లీ ఫామ్ ఆందోళన కలిగిస్తుంది.రోహిత్ శర్మ అద్భుతంగ రాణిస్తున్నాడు. సెమీఫైనల్ లో ఇంగ్లండ్‌పై సూర్యకుమార్ యాదవ్ కీ రోల్ ప్లే చేశాడు. జడేజా, హార్దిక్, అక్షర్ పటేల్ తమ పాత్రలను చాలా చక్కగా నిర్వరించారు. బౌలింగ్‌లో అర్ష్‌దీప్, బుమ్రాలకు తిరుగు లేదు. కుల్దీప్ స్పిన్ ముందు ఎలాంటి బ్యాటరయిన తలగ్గాల్సిందే. పిచ్ విషయానికి వస్తే.. బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ పిచ్‌పై బంతి మరియు బ్యాట్ మధ్య సమాన పోటీ కనిపిస్తుంది. ఈ మైదానంలో ఫాస్ట్ బౌలర్లకు కూడా బంతిని బౌన్స్‌తో స్వింగ్ చేసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో మిడిల్ ఓవర్లలో ఈ పిచ్ నుండి స్పిన్నర్లు కూడా సహాయం పొందుతారు. ఈ పిచ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 153 పరుగులు. మ్యాచ్‌లో టాస్ కీలక పాత్ర పోషిస్తుంది.ఓవల్ స్టేడియంలో మొత్తం 32 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 19 గెలిచింది.11 సార్లు లక్ష్యాన్ని ఛేదించిన జట్టు విజయం సాధించింది. రెండు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఈ పిచ్ పై ఆద్యాదికంగా 172 పరుగులు నమోదయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు జట్లూ భారీ స్కోరు చేయాలని చూస్తాయి.
Also Read: Telangana Budget 2024: బీఆర్ఎస్ “భ్రమ” బడ్జెట్ కాకుండా వాస్తవ బడ్జెట్ రెడీ చేయండి :సీఎం రేవంత్