IPL: కోల్ కత్తా జోరుకు పంజాబ్ బ్రేక్ వేస్తుందా ?
ఐపీఎల్ 2022 లో ఇవాళ 8వ కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు పోటీపడనున్నాయి. వాంఖడే మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది.
- By Naresh Kumar Published Date - 10:47 PM, Fri - 1 April 22

ఐపీఎల్ 2022 లో ఇవాళ 8వ కోల్‌కతా నైట్‌రైడర్స్, పంజాబ్ కింగ్స్ జట్లు పోటీపడనున్నాయి. వాంఖడే మైదానం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ సీజన్‌లో, కేకేఆర్ తో తాము ఆడిన రెండు మ్యాచుల్లో చెన్నై సూపర్ కింగ్స్ తో గెలుపొందగా.. ఇక మరోవైపు ఈ సీజన్ లో తాము ఆడిన తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ జట్టు ఆర్సీబీపై విజయం సాధించింది.. ఇక రెండు జట్ల మధ్య హెడ్ టుహెడ్ రికార్డుల ను పరిశీలిస్తే.. ఈ మెగా టోర్నీలో కేకేఆర్ , పంజాబ్ రెండు జట్లు మొత్తం 29 మ్యాచ్‌ల్లో తలపడగా కేకేఆర్ 19 మ్యాచుల్లో, పంజాబ్ 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి.
ఇక ఇరు జట్ల బలాబలాలను పరిశీలిస్తే.. కేకేఆర్ తో పోలిస్తే పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో బలంగా ఉందనే చెప్పాలి. ఆర్సీబీతో జరిగిన గత మ్యాచ్‌లో చిన్నచిన్న పోరపాట్లు మినహా పంజాబ్ కింగ్స్ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిందని చెప్పొచ్చు.
ఇక పంజాబ్ కింగ్స్ జట్టు కొత్త కెప్టెన్‌మయాంక్ అగర్వాల్ తొలి మ్యాచ్ లో తనకున్న వనరులను చక్కగా ఉపయోగించుకోగా, సీనియర్ బ్యాటర్ షైకర్ ధావన్, భానుక రాజపక్స సువర్ ఫామ్‌లో ఉండడం పంజాబ్ కింగ్స్ కి గుడ్ న్యూస్ అని చెప్పాలి. బ్యాటింగ్‌లో మయాంక్ అగర్వాల్, షైకర్ ధావన్, లివింగ్ స్టోన్, స్మిత్, షారుఖ్ ఖాన్ .. బౌలింగ్‌లో రాహుల్ చాహర్, సందీప్ శర్మ , అర్షదీప్ సింగ్ మంచి టచ్‌లో ఉండటం పంజాబ్ కింగ్స్ కు శుభపరిణామమని చెప్పాలి..
ఇక కేకేఆర్ జట్టు విషయానికొస్తే.. చెన్నైతో జరిగిన మ్యాచ్ లో రాణించిన ఆ జట్టు ఆటగాళ్లు ఆర్సీబీ తో జరిగిన మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ ఆటగాళ్లు రహానే, వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్, నితీష్ రానా దారుణంగా విఫలమయ్యారు.. ఇక కేకేఆర్ కీలక బౌలర్లు ఉమేష్ యాదవ్ , టీం సౌథీ , సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి పొదుపుగా బౌలింగ్ చేయడం కేకేఆర్ కు ఊరటనిచ్చే అంశం.