కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కొత్త కెప్టెన్ రాబోతున్నారా?
గత సీజన్లో అజింక్యా రహానే బ్యాటర్‌గా సగటు ప్రదర్శన మాత్రమే చేశారు. కెప్టెన్‌గా కూడా అతని నిర్ణయాలపై కొన్ని విమర్శలు వచ్చాయి. ఆటగాళ్ల రిటెన్షన్, రిలీజ్ జాబితాను విడుదల చేసినప్పుడు రహానే కెప్టెన్సీపై కేకేఆర్ యాజమాన్యం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
- Author : Gopichand
Date : 16-12-2025 - 8:30 IST
Published By : Hashtagu Telugu Desk
KKR Captain: ఐపీఎల్ 2026 మినీ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ అత్యధిక బడ్జెట్‌తో బరిలోకి దిగింది. తమ వద్ద ఉన్న భారీ మొత్తాన్ని వేలంలో చాలా తెలివిగా ఉపయోగించి, మ్యాచ్ విన్నర్లను జట్టులోకి తెచ్చుకుంది. అయితే వేలం ముగిసిన వెంటనే కేకేఆర్ కెప్టెన్సీపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అజింక్యా రహానేను కెప్టెన్సీ నుండి తప్పించి, ఫ్రాంచైజీ కొత్త నాయకుడిని ఎంచుకుంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
కెప్టెన్ మార్పుకు గల కారణాలు
గత సీజన్లో అజింక్యా రహానే బ్యాటర్‌గా సగటు ప్రదర్శన మాత్రమే చేశారు. కెప్టెన్‌గా కూడా అతని నిర్ణయాలపై కొన్ని విమర్శలు వచ్చాయి. ఆటగాళ్ల రిటెన్షన్, రిలీజ్ జాబితాను విడుదల చేసినప్పుడు రహానే కెప్టెన్సీపై కేకేఆర్ యాజమాన్యం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ వేలంలో కేకేఆర్ ప్రత్యేకంగా ఏ కెప్టెన్సీ మెటీరియల్‌ను కొనుగోలు చేయలేదు. దీంతో జట్టులో ఉన్న ఆటగాళ్లకే బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.
Also Read: ఈ ఏడాది నెటిజన్లు అత్యధికంగా వెతికిన బిజినెస్ లీడర్లు వీరే!
రింకూ సింగ్‌కు లక్కీ ఛాన్స్?
ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. రింకూ సింగ్‌ను కెప్టెన్ చేసే ఆలోచనలో ఫ్రాంచైజీ ఉన్నట్లు తెలుస్తోంది. యూపీ టీ20 లీగ్‌లో రింకూ తన కెప్టెన్సీతో అందరినీ ఆకట్టుకున్నాడు. అలాగే హెడ్ కోచ్ అభిషేక్ నాయర్‌కు కూడా రింకూ అంటే చాలా ఇష్టం. ఈ నేపథ్యంలో కొత్త సీజన్ ప్రారంభానికి ముందే రింకూ సింగ్‌కు అదృష్టం వరించవచ్చు.
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు
రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: రింకూ సింగ్, అంగ్క్రిష్ రఘువంశీ, రోవ్‌మన్ పావెల్, అజింక్యా రహానే, మనీష్ పాండే, సునీల్ నరైన్, రమణ్‌దీప్ సింగ్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్.
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: కామెరూన్ గ్రీన్, ఫిన్ అలెన్, మతీషా పతిరానా, కార్తీక్ త్యాగి, ప్రశాంత్ సోలంకి, రాహుల్ త్రిపాఠి, టిమ్ సీఫెర్ట్, ముస్తాఫిజుర్ రెహమాన్, సార్థక్ రంజన్, దక్ష్ కమ్రా, రచిన్ రవీంద్ర, ఆకాష్ దీప్.