Mohammed Shami : టీమిండియా షాంపేన్ వేడుక వేళ వేదిక దిగిన షమీ.. కారణమిదీ
ఇంతకీ షమీ(Mohammed Shami) ఎందుకిలా చేశారు ? షాంపేన్ వేడుకలో ఎందుకు పాల్గొనలేదు ? అనే ప్రశ్నకు సమాధానం ఉంది.
- By Pasha Published Date - 03:17 PM, Mon - 10 March 25

Mohammed Shami : దుబాయ్ వేదికగా జరిగిన ‘ఛాంపియన్స్ ట్రోఫీ 2025’ భారత్ కైవసం అయింది. దీనికి సంబంధించిన సెలబ్రేషన్స్ అట్టహాసంగా జరిగాయి. ట్రోఫీని భారత జట్టు అందుకున్న వెంటనే షాంపేన్ వేడుక మొదలైంది. ఆ వెంటనే ప్రతీ ప్లేయర్ ఆనందోత్సాహాలతో ఈ వేడుకలో భాగమయ్యారు. షాంపేన్ నురుగుల నడుమ విజయహాసాన్ని చిందించారు. జయహో నినాదాలు చేశారు. ఒకరిపై ఒకరు ఉత్సాహంగా షాంపేన్ చల్లుకున్నారు. ఈక్రమంలో ఒక భారత ప్లేయర్ మాత్రం వేదిక పై నుంచి దిగి సైలెంటుగా వెళ్లిపోయారు.
Also Read :Failure Story : మరో అనిల్ అంబానీ.. ప్రమోద్ మిట్టల్ ఫెయిల్యూర్ స్టోరీ.. చూసి నేర్చుకోండి
దూరం నుంచే చూసి ఆనందించి..
షాంపేన్ వేడుకలో భారత టీమ్ ప్లేయర్లు మునిగితేలుతున్న తరుణంలో వేదికపై నుంచి దిగిపోయిన ఆ ప్లేయర్ మహ్మద్ షమీ. ఆయన వేదిక నుంచి దిగిపోయి, కింది భాగంలో నిలబడి కరతాళ ధ్వనులతో తన తోటి ప్లేయర్లను అభినందించారు. తన టీమ్ విజయానందాన్ని దూరం నుంచే చూస్తూ ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read :Jagga Reddy : యాక్టర్‌గా జగ్గారెడ్డి.. ప్రేమ కథా చిత్రంలో కీలక పాత్ర
షాంపేన్‌లో ఆల్కహాల్ గురించి..
ఇంతకీ షమీ(Mohammed Shami) ఎందుకిలా చేశారు ? షాంపేన్ వేడుకలో ఎందుకు పాల్గొనలేదు ? అనే ప్రశ్నకు సమాధానం ఉంది. షమీ ఒక ముస్లిం. ఇస్లాం ప్రకారం మద్యానికి, మత్తు కలిగించే పదార్థాలకు దూరంగా ఉండాలి. మద్యాన్ని, మత్తు పదార్థాలను తాగడం కానీ.. తాకడం కానీ ఇస్లాం ప్రకారం నేరమే. ఈ రూల్‌ను షమీ పాటించారు. షాంపేన్‌లో 12.2 శాతం మేర ఆల్కహాల్ ఉంటుంది. అందుకే అది కూడా మత్తు పదార్థమే. ఈ కారణం వల్లే షాంపేన్ వేడుకలో షమీ పాల్గొనలేదు. ఆ వేడుక మొదలుకాగానే వేదిక నుంచి దిగిపోయారు. ఇప్పుడు రంజాన్ మాసం నడుస్తోంది. ముస్లింలు ఉపవాసాలు పాటిస్తారు. కానీ ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ వేళ మైదానంలో ఎనర్జీ డ్రింక్ తాగుతూ షమీ కనిపించారు. దీనిపై ఒక ముస్లిం మతపెద్ద అభ్యంతరం చెప్పారు. ఆ కామెంట్స్ వైరల్ అయ్యాయి. అయితే ఈసారి షాంపేన్ వేడుకకు దూరంగా ఉండటం ద్వారా ఇస్లామిక్ సంప్రదాయాలను షమీ గౌరవించారు.