Jagga Reddy : యాక్టర్‌గా జగ్గారెడ్డి.. ప్రేమ కథా చిత్రంలో కీలక పాత్ర
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికను చూసి తనకు మైండ్ బ్లాక్ అయిందని జగ్గారెడ్డి(Jagga Reddy) చెప్పారు.
- By Pasha Published Date - 01:01 PM, Mon - 10 March 25

Jagga Reddy : కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సినిమాల్లోకి ఎంటర్ కాబోతున్నారు. త్వరలోనే ఒక మూవీలో ఆయన కీలక పాత్రను పోషించబోతున్నారు. ఈ లవ్ స్టోరీ మూవీలో జగ్గారెడ్డి ఒరిజినల్ క్యారెక్టర్‌తో ఒక పాత్ర ఉందని సమాచారం. మాఫియాను ఎదిరించి ఒక ఆడపిల్లకు పెళ్లి చేసే ధైర్యవంతుడైన వ్యక్తి పాత్రలో జగ్గారెడ్డి నటించబోతున్నారట. జగ్గారెడ్డి నటించనున్న సినిమా షూటింగ్ ఈ ఏడాది ఉగాది తర్వాత ప్రారంభమై, వచ్చే ఏడాది ఉగాదికల్లా పూర్తవుతుందని తెలిసింది. ఈ మూవీలో నటించేందుకు తెలంగాణ పీసీసీ చీఫ్, సీఎం రేవంత్‌ల నుంచి ఆయన అనుమతిని తీసుకోనున్నారట. ఈ సినిమాకు ‘జగ్గారెడ్డి.. వార్ ఆఫ్ లవ్’ అనే టైటిల్‌ను నిర్ణయించారని వెల్లడైంది. ‘‘ఇది పాన్ ఇండియా మూవీ. దేశవ్యాప్తంగా రిలీజ్ చేస్తాం. తెలుగు,హిందీ భాషల్లో చిత్రం ఉంటుంది’’ అని జగ్గారెడ్డి చెప్పారు. ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఈ సినిమాకు వద్ది రామానుజం దర్శకత్వం వహిస్తున్నారు. జగ్గారెడ్డి సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుండటంపై ఆయన ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read :Buddha Vs KTR : కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు.. బుద్ధా వెంకన్న వార్నింగ్
జెట్టి కుసుమ్ కుమార్‌కు ఎమ్మెల్సీ గురించి..
తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికను చూసి తనకు మైండ్ బ్లాక్ అయిందని జగ్గారెడ్డి(Jagga Reddy) చెప్పారు. తన షాక్‌కు కాలమే సమాధానం చెబుతుందని ఆయన తెలిపారు. ‘‘కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు జెట్టి కుసుమ్ కుమార్‌కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వమని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కోరారు. ఈ విషయాన్ని సీఎం రేవంత్‌కు ముందే చెప్పాను. అయినా కుసుమ్‌కు అవకాశం దక్కలేదు. ఇదే విషయంపై మాట్లాడేందుకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్‌లను కలుద్దామని ఢిల్లీకి వచ్చాను. అయితే వారు అందుబాటులో లేరు’’ అని జగ్గారెడ్డి పేర్కొన్నారు.