HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Watch Kohli Gives Death Stare To Ganguly Moments Before Rcbs Win Dc Director Ignores Handshake

Virat Kohli- Ganguly: మరోసారి బయటపడ్డ కోహ్లీ-గంగూలీ మధ్య విభేదాలు.. గంగూలీకి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కోహ్లీ నిరాకరణ.. వీడియో వైరల్..!

బీసీసీఐ మాజీ చీఫ్ గంగూలీ (Ganguly), టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీ (Virat Kohli) మధ్య విభేదాలు సమసిపోయినట్టు కనిపించడం లేదు. ఐపీఎల్ 2023 20వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది.

  • By Gopichand Published Date - 10:41 AM, Sun - 16 April 23
  • daily-hunt
Virat Kohli- Ganguly
Resizeimagesize (1280 X 720) (1) 11zon

బీసీసీఐ మాజీ చీఫ్ గంగూలీ (Ganguly), టీమిండియా మాజీ కెప్టెన్ కోహ్లీ (Virat Kohli) మధ్య విభేదాలు సమసిపోయినట్టు కనిపించడం లేదు. ఐపీఎల్ 2023 20వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ 23 పరుగుల తేడాతో ఢిల్లీని ఓడించింది. ఈ సీజన్‌లో ఢిల్లీకి ఇది వరుసగా ఐదో ఓటమి. ఈ మ్యాచ్‌లో ఢిల్లీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 174 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా ఢిల్లీ జట్టు 151 పరుగులకే ఆలౌటైంది.

ఆర్సీబీ తరఫున విరాట్ కోహ్లి 34 బంతుల్లోనే అర్ధ సెంచరీ సాధించాడు. ఢిల్లీపై విరాట్ కోహ్లీ బ్యాట్‌తో అద్భుతాలు చేయడమే కాకుండా, ఫీల్డింగ్ సమయంలో కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌లో మూడు అద్భుతమైన క్యాచ్‌లను కూడా అందుకున్నాడు.  అయితే.. మ్యాచ్ ముగిసిన తర్వాత రెండు ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు, టీమ్ మేనేజ్‌మెంట్ ఒకరితో ఒకరు కరచాలనం ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా చర్చనీయాంశమైంది. నిజానికి మ్యాచ్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ, ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీతో కరచాలనం చేయలేదు. అంతేకాదు దాదాను కూడా కోహ్లీ పూర్తిగా పట్టించుకోలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు, సిబ్బంది పరస్పరం కరచాలనం చేసుకుంటున్నసమయంలో గంగూలీ, కోహ్లీ తారసపడ్డారు. అయితే, గంగూలీతో చేతులు కలిపేందుకు కోహ్లీ ఇష్టపడలేదు. అది చూసిన పాంటింగ్ గంగూలీతో చేతులు కలపాలని కోహ్లీకి చెప్పినప్పటికీ మరోమారు నిరాకరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Virat kohli Didn't shake hands with Ganguly… #RCBvDC pic.twitter.com/0jw8AjoGHW

— runmachinevirat (@runmachine117) April 15, 2023

ఫీల్డింగ్ సమయంలో RCB బౌలింగ్‌లో బౌండరీ లైన్‌ వద్ద అమన్‌ఖాన్‌కి క్యాచ్‌ని అందుకున్నప్పుడు కోహ్లీ ఉత్సాహం స్పష్టంగా కనిపించింది. క్యాచ్ తీసుకున్న తర్వాత అతను ఢిల్లీ క్యాపిటల్స్ డగౌట్‌లో కూర్చున్న హెడ్ కోచ్ రికీ పాంటింగ్, సౌరవ్ గంగూలీ వైపు చూస్తూ కనిపించాడు. ఈ ఘటన మళ్లీ కోహ్లి, గంగూలీల మధ్య ఉన్న పాత వివాదాన్ని బయటపెట్టిందని చర్చ జరుగుతుంది.

IPL 2021లో విరాట్ కోహ్లీ RCB, భారత T20 జట్టు కెప్టెన్సీని విడిచిపెట్టాడు. దీని తర్వాత వన్డే జట్టు కెప్టెన్సీకి కూడా గుడ్ బై చెప్పాడు. ఇది బీసీసీఐ నిర్ణయమని కోహ్లీ పేర్కొన్నాడు. ఆ సమయంలో సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నారు. కెప్టెన్సీ విషయంపై గంగూలీ మాట్లాడుతూ.. ఈ నిర్ణయం గురించి విరాట్‌తో మాట్లాడానని, జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని సూచించానని చెప్పాడు. అయితే దక్షిణాఫ్రికా టూర్‌కు వెళ్లే ముందు విరాట్‌ కోహ్లి విలేకరుల సమావేశంలో దీన్ని ఖండించాడు. తనతో ఎవరూ మాట్లాడలేదని విరాట్ చెప్పాడు. దీని తర్వాత టెస్టుల నుంచి కూడా కెప్టెన్సీకి కోహ్లీ గుడ్ బై చెప్పాడు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • delhi capitals
  • Ganguly
  • IPL 2023
  • rcb
  • virat kohli

Related News

RCB Franchise

RCB Franchise: అమ్మ‌కానికి ఆర్సీబీ.. కొనుగోలు చేయాల‌ని చూస్తున్న టాప్‌-5 కంపెనీలు ఇవే!

ఐపీఎల్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన జట్టు అయినప్పటికీ RCB గత 17 ఏళ్లుగా ఒక్క టైటిల్‌ను కూడా గెలవలేదు. విరాట్ కోహ్లీ, డివిలియర్స్ వంటి అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ వారికి కప్ దక్కలేదు.

  • Virat Kohli- Rohit Sharma

    Virat Kohli- Rohit Sharma: విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌కు బిగ్ షాక్‌!

  • Virat Kohli Net Worth 2025

    Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

  • Sanju Samson

    Sanju Samson: ఐపీఎల్ 2026 మెగా వేలం.. ఢిల్లీలోకి సంజు శాంస‌న్‌?!

Latest News

  • Krishna Railway Station : 100 ఏళ్ల తర్వాత కృష్ణ రైల్వే స్టేషన్‌కు మహర్దశ దక్కింది

  • Royal Enfield Bullet 650: బుల్లెట్ బైక్ కొనాల‌నుకునేవారికి అదిరిపోయే శుభ‌వార్త‌!

  • Politics : సిద్ధాంతాలు చెపుతున్న రాజకీయ నేతలు

  • Raina- Dhawan: టీమిండియా మాజీ క్రికెట‌ర్లు రైనా, ధావన్‌లకు బిగ్ షాక్‌!

  • Harleen Deol Asks PM Modi: ప్రధానిని ప్రశ్నించిన హర్లీన్ డియోల్.. క్వ‌శ్చ‌న్ ఏంటంటే?

Trending News

    • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

    • U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd