ఊతకర్రల సాయంతో నడుస్తున్న టీమిండియా ప్లేయర్.. వీడియో ఇదే!
హర్షిత్ ఇప్పటివరకు తన ఐపీఎల్ కెరీర్లో 34 మ్యాచ్‌లు ఆడాడు. 32 ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్ చేసి 25.72 సగటుతో 40 వికెట్లు పడగొట్టాడు. అతని అత్యుత్తమ ప్రదర్శన 3/24.
- Author : Gopichand
Date : 16-03-2026 - 2:56 IST
Published By : Hashtagu Telugu Desk
Harshit Rana: ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు కష్టాలు మొదలైనట్లు కనిపిస్తోంది. ఆ జట్టు స్టార్ పేసర్ హర్షిత్ రాణా ఊతకర్రల సహాయంతో నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడమే దీనికి కారణం. ఈ వీడియో చూసిన అభిమానుల్లో ఒకటే ఆందోళన హర్షిత్ ఈ సీజన్ మొత్తానికి దూరమవుతాడా?
విషయమేమిటంటే.. 2026 టీ20 వరల్డ్ కప్‌లో కూడా హర్షిత్ టీమ్ ఇండియాలో భాగమయ్యాడు. కానీ గాయం కారణంగా టోర్నీ నుండి వైదొలగాల్సి వచ్చింది. అతని స్థానంలో మహమ్మద్ సిరాజ్ జట్టులోకి వచ్చాడు. ఇప్పుడు కేకేఆర్ కూడా హర్షిత్ స్థానంలో మరొకరిని వెతుక్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
Also Read: ఆర్సీబీ అభిమానులకు గుడ్ న్యూస్!
Harshit Rana walking with a walking stick during the BCCI Awards.
Get well soon, Harshit Rana. pic.twitter.com/OPmqLvRXW9
— Sonu (@Cricket_live247) March 16, 2026
నమన్ అవార్డ్స్‌కు ఊతకర్రల సాయంతో
ఇటీవల జరిగిన ‘నమన్ అవార్డ్స్’ వేడుకకు భారత క్రికెటర్లందరూ హాజరయ్యారు. హర్షిత్ రాణా కూడా ఈ కార్యక్రమానికి వచ్చాడు. కానీ ఊతకర్రల సాయంతో రావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అవార్డు కోసం అతని పేరు పిలిచినప్పుడు అతను స్వయంగా వేదికపైకి వెళ్లలేకపోయాడు. దీంతో ఐపీఎల్ ఛైర్మన్ అరుణ్ ధుమాల్ స్వయంగా కిందికి వచ్చి అతడిని అవార్డుతో సత్కరించారు.
సీజన్ మొత్తానికి దూరమవుతాడా?
హర్షిత్ గాయంపై కేకేఆర్ ఫ్రాంచైజీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. మార్చి 28 నుండి ప్రారంభం కానున్న ఐపీఎల్ నాటికి అతను ఫిట్నెస్ సాధిస్తాడా లేదా అన్నది వేచి చూడాలి.
బలహీనపడుతున్న కేకేఆర్ బౌలింగ్
కోల్‌కతా నైట్ రైడర్స్ పేస్ విభాగం ఇప్పటికే కాస్త బలహీనంగా కనిపిస్తోంది. ముందుగా బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టు రిలీజ్ చేయాల్సి వచ్చింది. అతని స్థానంలో బ్లెస్సింగ్ ముజారబానీని తీసుకున్నారు. ఇప్పుడు హర్షిత్ విషయంలో టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
హర్షిత్ రాణా ఐపీఎల్ గణాంకాలు
హర్షిత్ ఇప్పటివరకు తన ఐపీఎల్ కెరీర్లో 34 మ్యాచ్‌లు ఆడాడు. 32 ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్ చేసి 25.72 సగటుతో 40 వికెట్లు పడగొట్టాడు. అతని అత్యుత్తమ ప్రదర్శన 3/24.