Virender Sehwag: 2023 ప్రపంచ కప్ కోహ్లీ కోసమైనా గెలవాలి
ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ వచ్చింది. ఈ టోర్నమెంట్ అక్టోబర్ 5, 2023 నుండి ప్రారంభం కానుంది, ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న జరుగుతుంది.
- By Praveen Aluthuru Published Date - 06:43 PM, Tue - 27 June 23

Virender Sehwag: ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ వచ్చింది. ఈ టోర్నమెంట్ అక్టోబర్ 5, 2023 నుండి ప్రారంభం కానుంది, ఫైనల్ మ్యాచ్ నవంబర్ 19న జరుగుతుంది. ఈ సందర్భంగా టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీని ప్రశంసలతో ముంచెత్తాడు వీరేంద్ర సెహ్వాగ్. కోహ్లీని సచిన్ టెండూల్కర్ తో పోల్చాడు.
భారత మాజీ ఓపెనర్ సెహ్వాగ్ 2011 ప్రపంచకప్ లో కీ రోల్ ప్లే చేశాడు. అయితే అప్పుడు సచిన్ టెండూల్కర్ కోసం 2011 ప్రపంచకప్ ఆడామని చెప్పాడు. ఇప్పుడు ఆటగాళ్లందరూ విరాట్ కోహ్లీ కోసం ప్రపంచ కప్ 2023 గెలవాలని ఇతర ఆటగాళ్లకు విజ్ఞప్తి చేశాడు. దీంతో పాటు అందరి దృష్టి ఇండో-పాక్ మ్యాచ్‌పైనే ఉంటుందని సెహ్వాగ్ చెప్పాడు. టీమ్ ఇండియా ఒత్తిడిలో ఉన్నప్పుడు సునాయాసంగా ఒత్తిడిని జయిస్తుందని చెప్పాడు. ఒత్తిడిలో ఆడే అలవాటు భారత్‌కు ఉంది, అయితే ఒత్తిడి సమయంలో పాకిస్థాన్ భారత్ పై గెలిచింది లేదన్నాడు. అంతేకాకుండా అందరి దృష్టి విరాట్ కోహ్లీపైనే ఉంటుందని భావిస్తున్నాను అని చెప్పాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియానికి భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరిగే గొప్ప మ్యాచ్‌ను చూసేందుకు లక్ష మందికి పైగా ప్రజలు చేరుకోనున్నారు. ఆ రోజు కోహ్లి భారీగా పరుగులు చేసి భారత్‌ను గెలిపించేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తాడని నేను ఖచ్చితంగా భావిస్తున్నానని అన్నాడు సెహ్వాగ్.
Read More: Hero Moto Corp: ఒకేసారి 5 రకాల బైక్స్ ని విడుదల చేస్తున్న మోటో కార్ప్.. పూర్తి వివరాలు ఇవే?