Virat Kohli: కోహ్లీపై షాకింగ్ కామెంట్స్.. విరాట్ ఎవరో నాకు తెలియదు: రొనాల్డో
క్రికెట్ రారాజు విరాట్ కోహ్లి (Virat Kohli) అంటే అభిమానులకు పిచ్చి. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న మూడో అథ్లెట్‌గా, గ్లోబల్ సూపర్‌స్టార్ గా పాపులర్ అయ్యాడు. కోహ్లీ పాపులారిటీ ఇక క్రికెట్‌కే పరిమితం కాదు.
- Author : Gopichand
Date : 13-01-2024 - 10:45 IST
Published By : Hashtagu Telugu Desk
Virat Kohli: క్రికెట్ రారాజు విరాట్ కోహ్లి (Virat Kohli) అంటే అభిమానులకు పిచ్చి. ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న మూడో అథ్లెట్‌గా, గ్లోబల్ సూపర్‌స్టార్ గా పాపులర్ అయ్యాడు. కోహ్లీ పాపులారిటీ ఇక క్రికెట్‌కే పరిమితం కాదు. క్రికెట్‌కు అంతగా ఆదరణ లేని దేశాల్లో కూడా ప్రజలు అతన్ని గుర్తించడం ప్రారంభించారు. అయితే ప్రపంచంలోని కొన్ని మూలల్లో కోహ్లీని అంత తేలికగా గుర్తించలేరని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. వెటరన్ ఫుట్‌బాల్ ఆటగాడు రొనాల్డోను కోహ్లీ గురించి అడగగా.. గుర్తించడానికి నిరాకరించాడు.
కోహ్లీని గుర్తించేందుకు నిరాకరించాడు
కోహ్లీని గుర్తించడానికి నిరాకరించిన ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో కాదు బ్రెజిల్‌కు చెందిన రొనాల్డో నజారియో. రొనాల్డో నజారియో అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాళ్ళలో ఒకరు. 1994, 2002లో FIFA ప్రపంచ కప్‌ను గెలుచుకున్నాడు. అతను ఇప్పుడు పదవీ విరమణ పొందాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కోహ్లీ గురించి తెలియదని చెప్పాడు. అమెరికన్ యూట్యూబర్ స్పీడ్ అతనిని మీకు విరాట్ కోహ్లీ తెలుసా అని ప్రశ్న అడిగినప్పుడు.. రొనాల్డో తనకు కోహ్లీ ఎవరో తెలియదని చెప్పాడు.
Also Read: Dhruv Jurel: ఒక్క టెస్టు మ్యాచ్ కూడా ఆడని ఆటగాడికి టీమిండియాలో చోటు.. ఎవరంటే..?
ప్రశ్న : మీకు విరాట్ కోహ్లీ తెలుసా?
రొనాల్డో: విరాట్ కోహ్లీ ఎవరు?
ప్రశ్న : టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ
రొనాల్డో: తెలియదు.
ప్రశ్న: మీకు విరాట్ కోహ్లీ తెలియదా?
రొనాల్డో: అతను ఎవరు? క్రీడాకారులు ఎవరైనా ఉన్నారా?
ప్రశ్న: అతను క్రికెట్ ప్లేయర్.
రొనాల్డో: అతను ఇక్కడ పెద్దగా పాపులర్ కాదు.
ప్రశ్న: అతను అత్యుత్తమ ఆటగాడు. బాబర్ ఆజం కంటే కూడా మంచి బ్యాట్స్ మెన్.
We’re now on WhatsApp. Click to Join.
యూట్యూబర్.. రొనాల్డోకు తన మొబైల్‌లోని విరాట్ కోహ్లీ ఫోటోను చూపించి “మీరు ఈ వ్యక్తిని ఎప్పుడూ చూడలేదా?” అని అడిగాడు. రొనాల్డో “అవును, నేను చూశాను” అని చెప్పుకొచ్చాడు. దీనిపై విరాట్ ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. రొనాల్డోకు వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. కోహ్లీ ఎవరో తెలియకపోవడం ఏంటని.. కావాలనే ఇలా చేశారని అంటున్నారు. విరాట్‌కు వరల్డ్‌వైడ్ పాపులారిటీ ఉందని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుట్‌బాల్ స్టార్ మెస్సీని కూడా కోహ్లీ మించిపోయాడని చెబుతున్నారు.