Virat Kohli: వైరల్ అవుతున్న కోహ్లీ లుక్, ఐపీఎల్ కోసం ఇండియాకి
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లండన్ నుంచి భారత్‌కు తిరిగొచ్చాడు. త్వరలో జరగనున్న ఐపీఎల్ టోర్నీ కోసం విరాట్ బెంగళూరు జట్టులో చేరనున్నాడు.
- By Praveen Aluthuru Published Date - 01:52 PM, Sun - 17 March 24

Virat Kohli: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ లండన్ నుంచి భారత్‌కు తిరిగొచ్చాడు. త్వరలో జరగనున్న ఐపీఎల్ టోర్నీ కోసం విరాట్ బెంగళూరు జట్టులో చేరనున్నాడు.
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌కు వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నాడు. విరాట్ కోహ్లి, అనుష్క శర్మలకు ఫిబ్రవరి 15న మగబిడ్డ జన్మించాడు. అనుష్క డెలివరీ కోసం లండన్ వెళ్లగా, కోహ్లి స్వల్ప విరామం తర్వాత ఇండియాకు తిరిగి వచ్చారు. ఈ ఉదయం లండన్ నుంచి ముంబై విమానాశ్రయంలో దిగారు. అయితే కోహ్లీ లుక్ చూసి నీటిజన్లు ఫిదా అవుతున్నారు. నెరిసిన గడ్డంతో కోహ్లీ కొత్త స్టైల్‌తో ఆకట్టుకుంటున్నాడు. దీనికి సంబందించిన వీడియోలు, ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ మార్చి 22న ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఆడనున్నాయి. చెన్నై చెపాక్ మైదానంలో తొలి మ్యాచ్ జరగనుంది.ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లూ ముమ్మరంగా కసరత్తు చేస్తుండగా, లండన్ నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన విరాట్ కోహ్లీ త్వరలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శిక్షణా శిబిరంలో చేరే అవకాశం ఉంది.
Also Read: WhatsApp Message : మోడీ సర్కారు వాట్సాప్ మెసేజ్‌పై వివాదం