WTC 2023 Final: ఆస్ట్రేలియాపై కోహ్లీ పరుగుల వరద పారిస్తాడు: గ్రెగ్ చాపెల్
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. జూన్ 7 నుంచి ఓవల్ మైదానంలో కంగారూ జట్టుతో టీమిండియా తలపడనుంది. కెప్టెన్ రోహిత్ పేలవమైన ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు.
- By Praveen Aluthuru Published Date - 05:06 PM, Sat - 3 June 23

WTC 2023 Final: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. జూన్ 7 నుంచి ఓవల్ మైదానంలో కంగారూ జట్టుతో టీమిండియా తలపడనుంది. కెప్టెన్ రోహిత్ పేలవమైన ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. గాయపడిన రిషబ్ పంత్ మరియు కేఎల్ రాహుల్ లేకుండానే భారత జట్టు టైటిల్ మ్యాచ్‌కు వెళ్లనుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత జట్టును ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత విరాట్ కోహ్లీ భుజస్కంధాలపైనే ఉంటుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో కోహ్లీ సునామి సృష్టిస్తాడని, కోహ్లీ బ్యాట్ నుండి గొప్ప పరుగులు రాబడతాడని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్రెగ్ చాపెల్ అభిప్రాయాడ్డారు. .
ఓ కార్యక్రమంలోగ్రెగ్ చాపెల్ మాట్లాడుతూ కోహ్లీపై ప్రశంసలు కురిపించాడు. విరాట్ ఆస్ట్రేలియాతో ఆడేందుకు ఇష్టపడతాడు. గతంలో జరిగిన మ్యాచ్ లలో దానిని నేను గమనించాను. గ్రెగ్ చాపెల్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే… ఓవల్ మైదానం విరాట్‌కు చాలా ఇష్టం. నా అనుభవం ప్రకారం ఓవల్ మైదానంలో మంచి బౌన్స్ ఉందని, అది విరాట్‌కు నచ్చుతుందని, అక్కడ వాతావరణం చాలా పొడిగా ఉందని చాపెల్ అన్నారు. విరాట్ కోహ్లీకి ఒంటరిగా పోరాడే సత్తా ఉంది. నేను అది మొదటి నుండి చూస్తున్నాను. వచ్చే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో కోహ్లీ కచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తాడంటూ ప్రశంసలు కురిపించాడు.
Read More: Virat Kohli: అనుష్కకు ముందు ఐదుగురితో కోహ్లీ డేటింగ్.. భలే బ్యూటీలను పట్టేశాడే!