HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Virat Kohli Big Record In Ind Vs Aus Ahmedabad Test

Virat Kohli Record: విరాట్ ఎన్నాళ్ళకెన్నాళ్ళకు..

ప్రపంచ క్రికెట్ లో రికార్డుల ఎవరెస్ట్ ఎవరంటే సచిన్ టెండూల్కర్ పేరే చెబుతారు... సచిన్ తర్వాత ఆ స్థాయిలో రికార్డులకు చిరునామాగా నిలిచింది మాత్రం

  • Author : Naresh Kumar Date : 11-03-2023 - 6:04 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Virat Kohli
Virat Kohli Big Record In Ind Vs Aus Ahmedabad test

ప్రపంచ క్రికెట్ లో రికార్డుల ఎవరెస్ట్ ఎవరంటే సచిన్ టెండూల్కర్ పేరే చెబుతారు… సచిన్ తర్వాత ఆ స్థాయిలో రికార్డులకు చిరునామాగా నిలిచింది మాత్రం విరాట్ కోహ్లీనే (Virat Kohli). ఫార్మాట్ తో సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తూ ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. గత మూడేళ్ళుగా ఫామ్ లేమితో ఇబ్బంది పడినా మళ్ళీ గాడినపడ్డాడు. అయితే టెస్టుల్లో మాత్రం విరాట్ (Virat Kohli) బ్యాట్ నుంచి భారీ ఇన్నింగ్స్ లు చూసి ఏడాది పైగా దాటిపోయింది. ఎట్టకేలకు కోహ్లీ టెస్టుల్లోనూ ఫామ్ లోకి వచ్చాడు. దాదాపు 14 నెలల తర్వాత టెస్టుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టులో ఈ స్టార్ బ్యాటర్ మునుపటి ఫామ్ అందుకున్నాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డు సృష్టించాడు.

సొంతగడ్డపై టెస్టుల్లో 4 వేల పరుగుల మైలురాయిని అందుకున్న భారత బ్యాటర్ గా రికార్డులకెక్కాడు. కోహ్లీ ఈ రికార్డును అందుకునే క్రమంలో పుజారా, వివిఎస్ లక్ష్మణ్ లను అధిగమించాడు. అహ్మదాబాద్ టెస్ట్ మూడోరోజు నాథన్ లయన్ వేసిన ఓవర్లో ఫోర్ కొట్టి కోహ్లీ ఈ ఘనతను అందుకున్నాడు. కోహ్లీ 50 మ్యాచ్ లలో 58.8 సగటుతో 4 వేలకు పైగా పరుగులు చేశాడు. అయితే యావరేజ్ విషయంలో మాత్రం కోహ్లీ , భారత క్రికెట్ దిగ్గజాలు ద్రావిడ్ , సచిన్ లను దాటేశాడు. భారత్ లో టెస్ట్ ఫార్మాట్ కు సంబంధించి అత్యధిక సగటు కలిగిన బ్యాటర్ల జాబితాలో కోహ్లీదే టాప్ ప్లేస్. ఆ తర్వాత సెహ్వాగ్ , సచిన్, పుజారా, లక్ష్మణ్ ఉన్నారు. కాగా ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ లో 25 వేలకు పైగా పరుగులు పూర్తి చేసుకున్న విరాట్ ఇప్పుడు సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ జాక్ కల్లిస్ ను అధిగమించేందుకు ఎదురుచూస్తున్నాడు. ఇక కోహ్లీ టెస్టుల్లో శతకం సాధించి మూడేళ్ళు దాటిపోగా… అహ్మదాబాద్ మ్యాచ్ లో తన సెంచరీ కరువు తీర్చుకోవాలని ఎదురుచూస్తున్నాడు.

Also Read:  Throat: ఈ చిట్కాలు పాటిస్తే గొంతు నొప్పిని దూరం చేయచ్చు..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ahmedabad
  • australia
  • BCCI
  • Big Record
  • cricket
  • ICC
  • india
  • Match
  • test
  • virat kohli

Related News

India's first ODI against England today... 'Ro-Ko' mania begins again.

Ind Vs Eng: ఇంగ్లాండ్‌తో భారత్‌ తొలి వన్డే నేడు.. రో– కో మ్యానియా మళ్లీ స్టార్ట్

టీ20 ప్రపంచకప్ 2026 గెలిచిన తర్వాత.. వరుసగా రెండు టీ20 సిరీస్‌లలో పరాజయం పాలైన భారత్.. ఇప్పుడు వన్డే ఫార్మాట్‌లో పోటీకి సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా నేడు భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా లాంటి సీనియర్ ఆటగాళ్ల రాకతో భారత్ పటిష్టంగా మారింది. అయితే ఇటీవల టీ20 సిరీస్ ఓటమి జట్టును వెంటాడుతోంది. ఈ మ్యాచ్‌కు ఉన్

  • Four gangsters killed in encounter in Gurugram

    Police Encounter: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్‌

Latest News

  • Nagarjuna Yadav: వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌కు 14 రోజుల రిమాండ్

  • iPhone 18 Pro: యాపిల్ యూజర్స్‌కు గుడ్‌న్యూస్..18 ప్రో, 18 ప్రో మ్యాక్స్.. సరికొత్త ఫీచర్లు ఇవే..!

  • Weather update: దంచికొట్టనున్న ఎండలు.. నేడు కూడా తీవ్ర ఉక్కపోత

  • Iran warning: నరకం చూపిస్తాం.. గల్ఫ్ దేశాలకు ఇరాన్ వార్నింగ్

  • GCC Summit : కార్పొరేట్ సంస్థల విజయం వెనుక అసలు రహస్యం అదే – సందీప్ ఎన్

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd