HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
Telugu
  • English
  • हिंदी
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat
  • Trending
  • # Pavan Kalyan
  • # Movie Reviews

  • Telugu News
  • ⁄Life Style
  • ⁄Follow These Tips To Get Rid Of Sore Throat

Throat: ఈ చిట్కాలు పాటిస్తే గొంతు నొప్పిని దూరం చేయచ్చు..

గత కొన్ని వారాలుగా ఫ్లూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇన్‌ఫ్లుయెంజా A H3N2 ఫ్లూ ప్రభావంతో ప్రతి ముగ్గురిలో ఒకరికి జ్వరం, దగ్గు, గొంతునొప్పి లక్షణాలు

  • By Maheswara Rao Nadella Published Date - 06:00 PM, Sat - 11 March 23
Throat: ఈ చిట్కాలు పాటిస్తే గొంతు నొప్పిని దూరం చేయచ్చు..

గత కొన్ని వారాలుగా ఫ్లూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇన్‌ఫ్లుయెంజా A H3N2 ఫ్లూ ప్రభావంతో ప్రతి ముగ్గురిలో ఒకరికి జ్వరం, దగ్గు, గొంతునొప్పి (Throat Pain) లక్షణాలు కనిపిస్తున్నాయి. H3N2 ఫ్లూ సోకిన వ్యక్తులను గొంతు నొప్పి విపరీతంగా ఇబ్బంది పెడుతుంది. కనీసం గుటకవేయడానికి కష్టంగా మారుతుంది. గొంతునొప్పికి చెక్‌పెట్టడానికి మన ఇంట్లోనే సులభంగా దొరికే వస్తువులు ఎంతగానో సహాయపడతాయి. కొన్ని ఇంటి చిట్కాలతో గొంతు నొప్పిని (Throat Pain) ఈజీగా తగ్గించవచ్చు. ఫ్లూ కారణంగానే కాకుండా, యాసిడ్ రిఫ్లక్స్, ఇతర కడుపు సమస్యలు, బి-కాంప్లెక్స్ వంటి ఖనిజ లోపాలు, విటమిన్ లోపం, ఫోలిక్ యాసిడ్ లోపం, ఐరన్ లోపం కారణంగా వచ్చే గొంతునొప్పిని ఈ టిప్స్‌తో ఎఫెక్టివ్‌గా తగ్గించవచ్చు.

తేనె:

గొంతు నొప్పిని తగ్గించడానికి తేనె అధ్భుతంగా పని చేస్తుంది. తేనె గొంతు నొప్పి, చికాకును తగ్గించడంలో సహాయపడుతుంది. తేనెలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు గొంతునొప్పిని శాంతపరుస్తాయి. ఒక చెంచా అల్లం రసం, ఒక చెంచా తేనె బాగా కలిపి తీసుకుంటే.. గొంతు నొప్పి త్వరగా నయమవుతుంది. తేనె శ్వాసనాళాలలో పేరుకున్న శ్లేష్మాన్ని కరిగిస్తుంది.

ఉప్పు నీళ్లు:

గోరువెచ్చని నీళ్లలో ఉప్పువేసి పుక్కిలిస్తే.. శ్లేష్మం విచ్ఛిన్నం అవుతుంది. ఇది గొంతులోని బ్యాక్టీరియాను చంపుతుంది. దీంతో గొంతునొప్పి త్వరగా నయం అవుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో అర టీస్పూన్ ఉప్పు వేసి పుక్కిలిస్తే.. గొంతు మంట తగ్గుతుంది, గొంతు క్లీన్‌ అవుతుంది. మీరు గొంతు నొప్పితో బాధపడుతుంటే.. రోజుకు రెండుసార్లు ఇలా చేయండి. రాళ్ల ఉప్పు వాడితే ఇంకా మంచిది.

బేకింగ్‌ సోడాతో:

ఉప్పు నీళ్లలో, బేకింగ్‌ సోడా వేసి పుక్కిలిస్తే.. గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. బేకింగ్‌ సొడా బ్యాక్టీరియాను చంపుతుంది, ఈస్ట్‌, కఫాన్ని పెరుగుదలను నిరోధిస్తుంది. ఒక కప్పు గోరువెచ్చని నీటీలో, 1/4 టీస్పూన్ బేకింగ్ సోడా, 2 చిటికెల ఉప్పు వేసి పుక్కిలించండి. గొంతు నొప్పి నుంచి త్వరగా రిలీఫ్‌ లభిస్తుంది.

చామంతి టీ:

చామంతిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు.. బ్యాక్టీరియల్ ఇన్‌ఫెక్షన్లతో పోరాడతాయి. మిమ్మల్ని గొంతు నొప్పి వేధిస్తుంటే.. రోజూ రెండు కప్పుల చామంతి టీ తాగండి. మీకు త్వరగా ఉపశమనం లభిస్తుంది. చామంతి టీ రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది, వైరస్లతో పోరాడటానికి సహాయపడుతుంది. మీరు వేడినీళ్లలో చామంతి ఆకులు వేసి.. ఆవిరి పీల్చినా గొంతు నొప్పి, జలుబు లక్షణాలు తగ్గుతాయి.

యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌:

యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ మైక్రోబియల్ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి వైరస్‌, బ్యాక్టీరయాలతో పోరాడటానికి సహాయపడతాయి. ఇది గొంతు నుంచి శ్లేష్మాన్ని బయటకు పంపుతుంది. యాపిల్‌ సైడర్‌ వెనిగర్‌‌లోని యాసిడ్‌ గుణాలు బ్యాక్టీరియా వ్యాప్తిని నిరోధిస్తాయి. ఒక కప్పు నీటిలో 1 నుంచి 2 టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి గంటకు ఒకసారి పుక్కిలిస్తే.. గొంతు నొప్పి త్వరగా తగ్గుతుంది.

వెల్లుల్లి:

వెల్లుల్లిలో యాంటీ మైక్రోబియల్, యాంటీ బాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. ఇందులోని అల్లిసిన్ అనే ఆర్గానోసల్ఫర్ కెమికల్‌లో యాంటీ ఇన్ఫెక్టివ్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్‌, యాంటీ వైరల్‌ గుణాలు అధికంగా ఉంటాయి. లక్షణాలు ఉంటాయి. వెల్లుల్లి మీ ఆహారంలో తీసుకుంటే.. జలుబు, ఫ్లూ కలిగించే వైరస్‌లను నివారించవచ్చు. ఓ వెల్లుల్లి పాయను బుగ్గన పెట్టుకొని పదిహేను నిమిషాల పాటు నములుతూ రసాన్ని మింగుతూ ఉంటే.. గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

మిరియాలు:

మిరియాల్లో యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలు అధికంగా ఉంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం.. మిరియాల్లోని పెప్పరైన్‌కి రోగాలకు కారణమయ్యే క్రిములను లార్వా దశలోనే చంపే శక్తి ఉంది. కప్పు నీటిలో అరచెంచా మిరియాలపొడి వేసి మరిగించిన కషాయంలో కొద్దిగా బెల్లం వేసి వేడివేడిగా తాగితే గొంతులో కఫం తగ్గుతుంది.

Also Read:  Cholesterol: కొలెస్ట్రాల్‌ ను కంట్రోల్ చేసేందుకు ఈ ట్యాబ్లేట్ ట్రై చేయండి..

Telegram Channel

Tags  

  • benefits
  • Follow
  • Get
  • health
  • Life Style
  • rid
  • Sore
  • throat
  • tips
  • Tricks
https://d31dai02dmgobf.cloudfront.net/wp-content/uploads/2022/03/divis-ad.jpeg

Related News

Baldness: మీ వేళ్లు అలా ఉన్నాయా? అయితే బట్టతల వస్తుంది..

Baldness: మీ వేళ్లు అలా ఉన్నాయా? అయితే బట్టతల వస్తుంది..

ఎంతోమంది పురుషులు బట్టతల సమస్యతో బాధపడుతుంటారు. చాలామంది చిన్న వయస్సులోనే తలపై జుట్టును కోల్పోతారు.  ఉంగరపు వేలు కంటే చూపుడు వేలు

  • Paracetamol Side Effects: నడుము నొప్పికి పారాసిటమాల్ వాడితే ఆ సైడ్ ఎఫెక్ట్స్.. రీసెర్చ్ రిపోర్ట్

    Paracetamol Side Effects: నడుము నొప్పికి పారాసిటమాల్ వాడితే ఆ సైడ్ ఎఫెక్ట్స్.. రీసెర్చ్ రిపోర్ట్

  • Shani: శని దేవుడిని శనివారం ప్రసన్నం చేసుకునే ఉపాయాలివీ..

    Shani: శని దేవుడిని శనివారం ప్రసన్నం చేసుకునే ఉపాయాలివీ..

  • Back Pain Tips: మీ వెన్ను నొప్పి సమస్యకు ఈ చిట్కాలు పాటించండి..!

    Back Pain Tips: మీ వెన్ను నొప్పి సమస్యకు ఈ చిట్కాలు పాటించండి..!

  • Soaps: నోరూరించే సబ్బులను చూసారా మీరు!

    Soaps: నోరూరించే సబ్బులను చూసారా మీరు!

Latest News

  • Covid In Pregnancy : కోవిడ్ సమయంలో ప్రెగ్నెన్సీ వస్తే కడుపులో బిడ్డకు ప్రమాదమా..? నిపుణులు ఏం చెబుతున్నారు..

  • WPL Final: తొలి టైటిల్ చిక్కేదెవరికి? ఢిల్లీ, ముంబై మధ్య ఫైనల్ ఫైట్

  • Canada Kalithan: కెన‌డాలో పంజాబ్ `ఖ‌లీస్తాన్` క‌ల‌క‌లం

  • Flu vaccine: H3N2 ఇన్ఫ్లుఎంజా నుంచి పిల్లలను కాపాడుకోవాలంటే, ఫ్లూ వ్యాక్సిన్ తప్పనిసరా..ఎక్కడ, ఎలా పొందాలో తెలుసుకోండి…

  • Orange Army: సన్ రైజ్ అయ్యేనా.. ఆరెంజ్ ఆర్మీ పై అంచనాలు

Trending

    • Business Idea : పట్నంతో పనిలేదు.. ఉన్న ఊరిలోనే కాలు మీద కాలు వేసుకొని చేయగలిగే బిజినెస్ లు ఇవే..

    • Rahul Disqualified : చింపిన ఆర్డినెన్స్ రాహుల్ పై వేటేసింది.!

    • Navjot Kaur: సిద్ధూ భార్యకు స్టేజ్ 2 క్యాన్సర్.. ఇక మనం కలవలేమా అంటూ ఎమోషనల్ పోస్టు..!

    • Gulzarilal Nanda: సాటి లేరు మీకెవ్వరు..

    • CBI Recruitment 2023: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బంపర్ ఆఫర్, 5వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: