Kohli- Rohit: ఆసియా కప్ 2025లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడనున్నారా?!
ఆసియా కప్ మొదటిసారిగా 1984లో జరిగింది. అప్పటి నుండి ఇప్పటివరకు మొత్తం 16 సార్లు టోర్నమెంట్‌లను నిర్వహించారు. భారత్ అత్యధిక సార్లు ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది.
- By Gopichand Published Date - 09:30 PM, Thu - 24 July 25

Kohli- Rohit: 2025 ఆసియా కప్ సెప్టెంబర్ నెలలో జరగనుంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) నుండి అధికారిక ధృవీకరణ ఇంకా రాలేదు. కానీ నివేదికల ప్రకారం ఈ టోర్నమెంట్ సెప్టెంబర్ 5 నుండి సెప్టెంబర్ 21 వరకు జరుగుతుంది. ఈసారి ఆసియా కప్ T20 ఫార్మాట్‌లో జరగనుంది. భారత్, పాకిస్తాన్‌తో సహా మొత్తం 8 జట్లు ఇందులో పాల్గొననున్నాయి. భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ గురించి ఇంకా స్పష్టమైన అప్‌డేట్‌లు లేదు. అయితే ఈ ఆసియా కప్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ (Kohli- Rohit) ఆడుతారా లేదా అనే చర్చ జరుగుతోంది.
రోహిత్-విరాట్ ఆసియా కప్‌లో ఆడతారా?
ఆఖరిసారిగా 2023లో జరిగిన ఆసియా కప్ ODI ఫార్మాట్‌లో జరిగింది. అయితే 2025లో ఈ మ్యాచ్‌లు T20 ఫార్మాట్‌లో జరగనున్నాయి. అందుకే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రాబోయే 2025 ఆసియా కప్‌లో ఆడరు. ఎందుకంటే 2024 T20 వరల్డ్ కప్ ఫైనల్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన తర్వాత వీరిద్దరూ T20 క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు.
Also Read: England vs India: మాంచెస్టర్ టెస్ట్.. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆలౌట్, పంత్ హాఫ్ సెంచరీ!
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ చివరిసారిగా 2025 మార్చి 9న జరిగిన చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత జెర్సీలో కనిపించారు. ఆ ఫైనల్‌లో టీమ్ ఇండియా న్యూజిలాండ్‌ను 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఆ తర్వాత కొద్దిరోజులకే IPL 2025 సమయంలో వీరిద్దరూ టెస్ట్ ఫార్మాట్ నుండి కూడా రిటైర్మెంట్ తీసుకుని క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించారు.
భారత్ ఎన్నిసార్లు ఆసియా కప్ గెలిచింది?
ఆసియా కప్ మొదటిసారిగా 1984లో జరిగింది. అప్పటి నుండి ఇప్పటివరకు మొత్తం 16 సార్లు టోర్నమెంట్‌లను నిర్వహించారు. భారత్ అత్యధిక సార్లు ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పటివరకు మొత్తం 8 సార్లు ట్రోఫీని సొంతం చేసుకుంది. గత ఛాంపియన్ కూడా భారతే కావడం విశేషం. 2023 ఆసియా కప్ ఫైనల్‌లో శ్రీలంకను 10 వికెట్ల తేడాతో ఓడించింది. శ్రీలంక 6 సార్లు, పాకిస్తాన్ రెండు సార్లు ఈ టోర్నమెంట్‌ను గెలిచాయి.