Vinod Kambli Health: వినోద్ కాంబ్లీ ఆరోగ్య పరిస్థితిపై ఫ్రెండ్స్ కీలక అప్డేట్
సచిన్ ప్రాణస్నేహితుగా పిలవబడే కాంబ్లీ ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక పరిస్థితిపై స్పందిస్తూ సచిన్ తనకు సహాయం చేసేందుకు ముందుకు రావాలని కోరుతున్నారు. బీసీసీఐ కూడా దయ ఉంచి పెన్షన్ పెంచి ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే అభిమానుల ప్రేమానురాగాలపై కాంబ్లీ స్పందించాడు
- By Praveen Aluthuru Published Date - 06:15 PM, Sat - 10 August 24

Vinod Kambli Health: టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అయితే ఈ మధ్య ఓ వీడియో కంటతడి పెట్టించింది. ఒకప్పుడు చిరుత పులిలా పరుగెత్తే ఈ స్టార్ బ్యాట్స్ మెన్ దయానీతి స్థితిలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయాడు. దీంతో కాంబ్లీ పరిస్థితిని గుర్తించి అక్కడ ఉన్న కొందరు అతనికి సహాయం చేశారు. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో సగటు క్రీడాభిమాని ఉండబట్టలేకపోయారు.
సచిన్ ప్రాణస్నేహితుగా పిలవబడే కాంబ్లీ ఆరోగ్యంపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక పరిస్థితిపై స్పందిస్తూ సచిన్ తనకు సహాయం చేసేందుకు ముందుకు రావాలని కోరుతున్నారు. బీసీసీఐ కూడా దయ ఉంచి పెన్షన్ పెంచి ఇవ్వాల్సిందిగా కోరారు. అయితే అభిమానుల ప్రేమానురాగాలపై కాంబ్లీ స్పందించాడు. తనను ఇంతగా అభిమానిస్తున్న ఫ్యాన్స్ కు కాంబ్లీ గుడ్ న్యూస్ తెలిపాడు. నేను బాగానే ఉన్నాను. సోషల్ మీడియాను నమ్మొద్దు అని వినోద్ కాంబ్లీ చెప్పాడు. వాస్తవానికి వినోద్ కాంబ్లీ చిన్ననాటి స్నేహితుడు రిక్కీ, ఫస్ట్ క్లాస్ అంపైర్ మార్కస్.. ఆయన నివాసానికి వెళ్లారు. కాంబ్లీతో చాలాసేపు సంభాషించారు. ఈ సందర్భంగా కాంబ్లీ స్నేహితులు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. వినోద్ కాంబ్లీ తమతో చాలా సరదాగా ఉన్నాడని, ఆరోగ్యపరంగా ఆయనకు ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేవని రిక్కీ, మార్కస్ తెలిపారు.
VIDEO: https://x.com/RSingh6969a/status/1821835313683059075
కాంబ్లీ ఆరోగ్యం ఫర్వాలేదని వాళ్ళు చెప్పడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇది కాక త్వరలో సచిన్ కూడా కాంబ్లీని కలవనున్నట్లు తెలుస్తుంది. ఇక ఆయన క్రికెట్ కెరీలో 100 వన్డేలు మరియు 17 టెస్ట్ మ్యాచ్‌లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో రూ.10,000 పరుగులు సాధించాడు. ఇందులో అతని అత్యధిక స్కోరు 262 పరుగులు.
Also Read: Dharmavaram Train Accident : ఏపీలో మరో రైలు ప్రమాదం