HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Sports
  • >Trisha Gongadi Scores First Ever Century In U 19 Womens World Cup History

Trisha Gongadi: టీ20 ప్రపంచకప్‌లో తెలుగమ్మాయి రికార్డు.. 53 బంతుల్లోనే సెంచ‌రీ!

భద్రాచలం (తెలంగాణ)కు చెందిన త్రిష గొంగడి మహిళల అండర్-19 ప్రపంచకప్‌లో తొలి సెంచరీ సాధించిన ఘనత సాధించింది.

  • By Gopichand Published Date - 02:26 PM, Tue - 28 January 25
  • daily-hunt
Trisha Gongadi
Trisha Gongadi

Trisha Gongadi: అండర్-19 మహిళల టీ-20 ప్రపంచకప్‌లో భారత్, స్కాట్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో టీమిండియా క్రీడాకారిణి గొంగడి త్రిష అద్భుత ప్రదర్శన చేసింది. త్రిష సెంచరీ చేసి చరిత్ర సృష్టించింది. అండర్-19 మ‌హిళ‌ల టీ20 ప్రపంచకప్ 2025లో భారత ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ త్రిష గొంగడి (Trisha Gongadi) సరికొత్త రికార్డు సృష్టించింది.

ఈ టోర్నీ చరిత్రలో సెంచరీ సాధించిన తొలి క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. మలేషియాలోని కౌలాలంపూర్‌లో మంగళవారం (జనవరి 28) స్కాట్లాండ్ అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆమె ఈ రికార్డును తన పేరిట లిఖించుకుంది. త్రిష 59 బంతుల్లో 110 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడింది. ఈ సమయంలో ఆమె 13 ఫోర్లు, 4 సిక్సర్లు బాదింది. త్రిష ఈ ఇన్నింగ్స్‌లో ఆమె స్ట్రైక్ రేట్ 186.44. భద్రాచలం (తెలంగాణ)కు చెందిన త్రిష గొంగడి మహిళల అండర్-19 ప్రపంచకప్‌లో తొలి సెంచరీ సాధించిన ఘనత సాధించింది. అంతకుముందు ఇంగ్లండ్ క్రీడాకారిణి గ్రేస్‌ స్క్రీవెన్స్‌ ఒక ఇన్నింగ్స్‌లో అత్యధికంగా 93 పరుగులు చేసింది.

Trisha Gongadi etches her name in the record books with the first-ever century in Women's #U19WorldCup history 🤩

➡️ https://t.co/1s19nAR2sR pic.twitter.com/YgGgtVVcJP

— ICC (@ICC) January 28, 2025

త్రిష ఈ తుఫాను ఇన్నింగ్స్‌కు స‌ర్వ‌త్రా ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి. త్రిష ఇన్నింగ్స్ కార‌ణంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 208/1 పరుగులు చేసింది. త్రిషకు మ‌రో ఓపెనర్, వికెట్ కీపర్ కమలినీ గుణాలన్ నుండి అద్భుతమైన మద్దతు లభించింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 147 పరుగులు జోడించారు. కమలిని (51) ప‌రుగులు చేసి ఔటయ్యారు. సూపర్ సిక్స్‌లోని ఈ మ్యాచ్‌లో త్రిష, కమిలనీతో పాటు సానికా చాల్కే కూడా 29 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. స్కాట్లాండ్‌ తరఫున అమాసి మస్సెరాకు ఏకైక వికెట్ దక్కింది. మ్యాచ్ ఆద్యంతం స్కాట్లాండ్ బౌలర్లు ఇబ్బంది పడుతూనే కనిపించారు.

Also Read: Smriti Mandhana: మహిళల క్రికెట్ లోనూ భారత్ జోరు.. వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా స్మృతి

ICC మహిళల అండర్-19 T20 ప్రపంచ కప్‌లో అత్యధిక స్కోర్లు (వ్యక్తిగతం)

  • త్రిష గొంగడి (భారతదేశం) – 110 పరుగులు, 2025
  • గ్రేస్ స్క్రివెన్స్ (ఇంగ్లండ్) – 93 పరుగులు, 2023
  • శ్వేతా సెహ్రావత్ (భారతదేశం)-92* పరుగులు, 2023
  • షఫాలీ వర్మ (భారతదేశం) – 78 పరుగులు, 2023
  •  శ్వేతా సెహ్రావత్ (భారతదేశం)-74* పరుగులు, 2023


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ICC
  • IND vs SCO
  • sports news
  • T20 world cup
  • Telangana Cricketer
  • Trisha Gongadi
  • U-19 Women’s World Cup

Related News

Yograj Singh

Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

2011 వన్డే ప్రపంచకప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు కూడా అందుకున్నాడు. ఆ టోర్నమెంట్‌లో యువరాజ్ ఒక శతకం, 4 అర్ధ శతకాలతో 362 పరుగులు చేయడంతో పాటు 15 వికెట్లు కూడా పడగొట్టాడు.

  • Ross Taylor

    Ross Taylor: స్టార్ క్రికెట‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. రిటైర్మెంట్ వెన‌క్కి!

  • Team India New Sponsor

    Team India New Sponsor: బీసీసీఐకి కొత్త స్పాన్స‌ర్‌.. రేసులో ప్ర‌ముఖ కార్ల సంస్థ‌!

  • Hardik Pandya

    Hardik Pandya: ఆసియా క‌ప్‌కు ముందు స‌రికొత్త లుక్‌లో హార్దిక్ పాండ్యా!

  • Amit Mishra

    Amit Mishra: అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన మ‌రో టీమిండియా క్రికెట‌ర్‌!

Latest News

  • Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

  • GST 2.0 : GST 2.0తో ప్రభుత్వానికి ఎంత నష్టమంటే?

  • Kavitha Vs Harish : నాపై చేసిన ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా..కవిత కు ఇన్ డైరెక్ట్ కౌంటర్ ఇచ్చిన హరీశ్

  • Afghanistan Earthquake : ప్రాణాలు పోతుంటే విపరీత ఆచారం అవసరమా?

  • Gym Germs: వామ్మో.. జిమ్ పరికరాలపై ప్రమాదకరమైన బ్యాక్టీరియా!

Trending News

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    • Raja Singh : పోలీసుల ఆంక్షలపై రాజాసింగ్ అభ్యంతరం..హిందూ పండుగలను నియంత్రించే హక్కు మీకెక్కడిది? !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd