Temba Bavuma: కోహ్లీ,రోహిత్ లేకున్నా ఈ జట్టుతో మాకు సవాలే
భారత్ లో మళ్లీ క్రికెట్ సందడి మొదలు కాబోతోంది. ఐపీఎల్ ను ఎంజాయ్ చేసిన ఫాన్స్ ఇప్పుడు భారత్ , దక్షిణాఫ్రికా టీ ట్వంటీ సీరీస్
- By Naresh Kumar Published Date - 05:19 PM, Mon - 6 June 22

భారత్ లో మళ్లీ క్రికెట్ సందడి మొదలు కాబోతోంది. ఐపీఎల్ ను ఎంజాయ్ చేసిన ఫాన్స్ ఇప్పుడు భారత్ , దక్షిణాఫ్రికా టీ ట్వంటీ సీరీస్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే కోహ్లీ , రోహిత్ , బుమ్ర వంటి ప్లేయర్స్ రెస్ట్ తీసుకోగా ..కే ఎల్ రాహుల్ సారథ్యంలో భారత్ జట్టు బరిలోకి దిగుతోంది. ఐపీఎల్ లో అదరగొట్టిన పలువురు యువ ఆటగాళ్ళు జట్టులోకి ఎంపికవగా హోరా హోరీ క్రికెట్ పోరు ఖాయంగా కనిపిస్తోంది. అయితే
ఈ సీరీస్ ను దక్షిణాఫ్రికా ఛాలెంజింగ్ గా తీసుకుంది. ఈ ఏడాది జరగబోయే వరల్డ్‌కప్‌కు సరైన ప్లేయర్స్‌ను ఎంపిక చేసుకునేందుకు ఇండియాతో సిరీస్ ఉపయోగపడుతుందని సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా అన్నాడు. రోహిత్, కోహ్లిలాంటి ప్లేయర్స్ లేకపోవడంపై స్పందిస్తూ.. తాము దీనిని బీ టీమ్‌గా ఏమీ పరిగణించడం లేదని స్పష్టం చేశాడు. ఇప్పటికీ ఇండియాతో పోటీ తీవ్రంగానే ఉండబోతోందని అభిప్రాయపడ్డాడు.
వరల్డ్‌కప్‌కు ముందు టీమ్‌లో ప్లేయర్స్ ఎవరి రోల్ ఏంటో తెలుసుకోవడానికి తమకు ఈ సిరీస్ బాగా ఉపయోగపడుతుందని బవుమా అన్నాడు. ఇండియాలో పరిస్థితులు ఆస్ట్రేలియాకు భిన్నంగా ఉన్నా కూడా ఎలాంటి క్రికెట్ ఆడినా తమకు మేలే జరుగుతుందని చెప్పాడు. అటు సౌతాఫ్రికా టీమ్ కూడా ఈ సిరీస్‌కు ఇద్దరు, ముగ్గురు యువ ఆటగాళ్లను ఎంపిక చేసింది. డికాక్‌తో సరైన ఓపెనింగ్ జోడీ కోసం సౌతాఫ్రికా చూస్తోంది.
ఇక ఈ సిరీస్‌లో ఆడుతోన్న భారత్ జట్టు గురించి బవూమా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇది కొత్తగా కనిపిస్తున్న ఇండియన్ టీమ్ అని, ఐపీఎల్ బాగా ఆడిన చాలా మంది ప్లేయర్స్‌కు ఛాన్సిచ్చారాన్నాడు. దీనిని తాము బీ సైడ్‌గా కూడా చూడటం లేదని స్పష్టం చేశాడు. ఈ టీమ్‌తోనూ పోటీ తీవ్రంగానే ఉంటుందని అన్నాడు. ఈ మధ్య కాలంలో దూకుడుగా ఆడే ప్లేయర్స్ భారత్ జట్టులో ఎక్కువయ్యారని బవుమా అభిప్రాయపడ్డాడు. గత రెండేళ్లుగా టీమిండియా మైండ్‌సెట్ పూర్తిగా మారిపోయిందని చెప్పాడు. రోహిత్, విరాట్ లేకపోయినా భారత్ జట్టు పోరాట పటిమ తగ్గదన్నాడు.రెండు జట్ల మధ్య అయిదు టీ ట్వంటీల సీరీస్ జూన్ 9 నుంచి ప్రారంభం కానుంది.