HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Team Indias Cash Shower Bccis Bumper Offer

టీమిండియాపై నోట్ల వర్షం.. బీసీసీఐ బంపర్ ఆఫర్

  • Author : Vamsi Chowdary Korata Date : 10-03-2026 - 12:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
T20 World Cup 2026
T20 World Cup 2026
BCCI  టీ20 ప్రపంచకప్ 2026లో చారిత్రక విజయం సాధించిన భారత క్రికెట్ జట్టుపై బీసీసీఐ కాసుల వర్షం కురిపించింది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియాకు ఏకంగా రూ.131 కోట్ల భారీ నగదు బహుమతిని ప్రకటించింది. తద్వారా గతంలో తానే సృష్టించిన రికార్డును బీసీసీఐ బద్దలు కొట్టింది. 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత్ ప్రపంచకప్ గెలిచినప్పుడు రూ.125 కోట్లు ప్రకటించగా, ఇప్పుడు ఆ రికార్డును అధిగమించడం విశేషం.

అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి భారత్ వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో సొంత వేదిక‌పై టైటిల్‌ను నిలబెట్టుకున్న తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా ఈ విజయంతో భారత్ మొత్తం మూడుసార్లు ఈ టోర్నీని గెలిచిన ఏకైక జట్టుగా నిలిచింది. ఈ చారిత్రక విజయం సందర్భంగా ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, సెలక్టర్లకు బీసీసీఐ అభినందనలు తెలుపుతూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించింది.

ఐసీసీ నుంచి కూడా భారీ ప్రైజ్ మనీ
బీసీసీఐ ప్రకటించిన నజరానాతో పాటు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నుంచి కూడా భారత జట్టుకు భారీ మొత్తంలో ప్రైజ్ మనీ లభించింది. టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా నిలిచినందుకు సూర్యకుమార్ సేనకు ఐసీసీ 3 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 27.48 కోట్లు) బహుమతిగా అందించింది. ఈ టోర్నీ కోసం ఐసీసీ రికార్డు స్థాయిలో 13.5 మిలియన్ డాలర్ల ప్రైజ్ మ‌నీని కేటాయించింది. ఇది గత ఎడిషన్ కంటే 20 శాతం అధికం.

ఈ ఫైనల్ విన్నింగ్ అమౌంట్‌కు అదనంగా, టోర్నీలో గ్రూప్, సూపర్ 8 దశల్లో గెలిచిన ప్రతి మ్యాచ్‌కు కూడా టీమిండియాకు బోనస్‌లు అందాయి. ప్రతి విజయానికి సుమారు 31,154 డాలర్లు (దాదాపు రూ. 28.6 లక్షలు) చొప్పున అదనపు మొత్తాన్ని భారత ఆటగాళ్లు సంపాదించారు. మొత్తంగా ఈ చారిత్రక విజయంతో భారత జట్టుపై బీసీసీఐ, ఐసీసీల నుంచి కోట్ల రూపాయల వర్షం కురిసింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • Cricket Team India
  • ICC T20 World Cup 2026
  • indian cricket team
  • Mens T20 World Cup 2026
  • Prize Money
  • Suryakumar Yadav
  • Suryakumar Yadav (SKY)
  • team india

Related News

Notices to Team India Players Yashasvi Jaiswal, Shafali Verma

NADA: టీమిండియా ఆటగాళ్లకు నోటీసులు

భారత క్రికెట్‌లో కలకలం రేగింది. టీమిండియా యువ సంచలనాలు, స్టార్ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, షఫాలీ వర్మలకు జాతీయ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ (నాడా) నోటీసులు జారీ చేసింది. డోప్ టెస్టింగ్ కోసం నిర్దేశిత సమయంలో అందుబాటులో లేకపోవడంతో ‘వేర్‌అబౌట్స్ ఫెయిల్యూర్’ కింద వారిపై ఈ చర్యలు తీసుకుంది. ఈ విషయంపై బీసీసీఐ, ఐసీసీలకు కూడా ‘నాడా’ సమాచారం అందించింది. నాడా నిబంధనల ప్రకారం ‘రిజ

  • Who is Team India's new T20 captain?

    T20 Captain: టీమిండియా టీ20 కొత్త కెప్టెన్‌ ఎవరంటే?

  • BCCI Announces IPL 2026 Playoffs schedule

    IPL 2026: ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ షెడ్యూల్ విడుదల.. ఈసారి ఫైనల్‌ అక్కడే?

Latest News

  • Vijay Joseph: సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం..

  • Trisha: విజయ్ ప్రమాణ స్వీకారానికి త్రిష..

  • Nara Bhuvaneswari: ‘తలసేమియా రన్’ వ్యాధిపై అవగాహన కల్పించి చిన్నారులు అండగా నిలవాలని నారా భువనేశ్వరి

  • CM VIJAY దళపతి ప్రమాణ స్వీకారం

  • TVK విజయ్‌ అను నేను..

Trending News

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

    • CM VIJAY: టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు లైన్‌ క్లియర్‌

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd