Old Trafford: ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో టీమిండియా రికార్డు ఇదే.. 9 టెస్ట్‌లు ఆడితే ఎన్ని గెలిచిందో తెలుసా?
లార్డ్స్ మైదానంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత జట్టు ఇంగ్లండ్ చేతిలో 22 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. రవీంద్ర జడేజా.. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌లతో కలిసి జట్టు ఓటమిని నివారించేందుకు చాలా ప్రయత్నించాడు.
- By Gopichand Published Date - 06:30 PM, Wed - 16 July 25

Old Trafford: లార్డ్స్‌లో ఓటమి తర్వాత టీమ్ ఇండియా ఇప్పుడు సిరీస్‌లో 1-2తో వెనుకబడి ఉంది. రవీంద్ర జడేజా ఎంతగా ప్రయత్నించినప్పటికీ మూడో టెస్ట్‌లో భారత జట్టు విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు తదుపరి మ్యాచ్ ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో (Old Trafford) జరగనుంది. ఇంగ్లండ్‌లోని ఈ మైదానం టీమ్ ఇండియాకు ఏ మాత్రం సానుకూలం కాదు. ఈ గ్రౌండ్‌లో ఇప్పటివరకు భారత్ ఒక్క టెస్ట్ మ్యాచ్‌లో కూడా విజయం సాధించలేదు. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లోని ఈ సిగ్గుచేటైన రికార్డును చూస్తే, భారత అభిమానులకు సిరీస్ నాల్గవ టెస్ట్‌లోనే చేజారిపోతుందేమోనని భయం మొదలైంది.
ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో సిగ్గుచేటైన రికార్డ్
టీమ్ ఇండియా ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో ఇప్పటివరకు మొత్తం 9 సార్లు వైట్ జెర్సీలో ఆడింది. ఈ 9 మ్యాచ్‌లలో నాలుగు సార్లు భారత జట్టు ఓటమి చవిచూడగా, 5 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. అయితే ఒక్క మ్యాచ్‌లో కూడా టీమ్ ఇండియాకు విజయం దక్కలేదు. అంటే శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని యువ బృందం సిరీస్‌ను 2-2తో సమం చేయాలంటే,ఎడ్జ్‌బాస్టన్‌లో చూపించిన ఆటను ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో కూడా ప్రదర్శించాలి. భారత జట్టును విజయతీరానికి చేర్చే బాధ్యతను కెప్టెన్ గిల్ స్వయంగా తీసుకోవాలి. లార్డ్స్‌ల ఆడిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో గిల్ బ్యాట్ ఆశించిన స్థాయిలో పరుగులు సాధించలేకపోయింది.
Also Read: AB Venkateswara Rao: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఉపశమనం!
India's record at the Old Trafford:
Matches – 9.
Won – 0.
Lost – 4.
Draw – 5. pic.twitter.com/Awvk5nLniN— Mufaddal Vohra (@mufaddal_vohra) July 16, 2025
హోరాహోరీ మ్యాచ్‌లో ఓటమి
లార్డ్స్ మైదానంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత జట్టు ఇంగ్లండ్ చేతిలో 22 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. రవీంద్ర జడేజా.. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌లతో కలిసి జట్టు ఓటమిని నివారించేందుకు చాలా ప్రయత్నించాడు. కానీ ఓటమిని ఆపడంలో విఫలమయ్యాడు. జడేజా 181 బంతులు ఆడి 61 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. బుమ్రా 54 బంతులు, సిరాజ్ 30 బంతులు ఆడారు. ఇంతకుముందు ఎడ్జ్‌బాస్టన్‌లో టీమ్ ఇండియా ఇంగ్లండ్‌ను 336 పరుగుల తేడాతో చిత్తు చేసింది. అయితే హెడింగ్లీలో ఆతిథ్య జట్టు విజయం సాధించింది.