ఆస్ట్రేలియాకు భారీ షాక్ ఇచ్చిన జింబాబ్వే!
టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఆస్ట్రేలియాపై జింబాబ్వేకు ఇది రెండో విజయం. అంతకుముందు 2007లో ఆ జట్టు ఆస్ట్రేలియాను ఓడించింది.
- Author : Gopichand
Date : 13-02-2026 - 4:20 IST
Published By : Hashtagu Telugu Desk
Zimbabwe Beat Australia: టీ20 ప్రపంచ కప్‌లో జింబాబ్వే జట్టు మరోసారి చరిత్రను పునరావృతం చేస్తూ ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. గ్రూప్-బిలో జరిగిన కీలక మ్యాచ్‌లో జింబాబ్వే 26 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఆస్ట్రేలియాకు ఈ ఓటమి ఊహించని షాక్ అని చెప్పాలి. జింబాబ్వే సాధించిన ఈ విజయంతో గ్రూప్-బి పాయింట్ల పట్టికలో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. జింబాబ్వే ఇప్పుడు 2 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 4 పాయింట్లు సాధించగా, ఆస్ట్రేలియాకు సూపర్-8 దారి మరింత కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ తర్వాత గ్రూప్-బి పాయింట్ల పట్టిక ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
రెండో స్థానానికి చేరుకున్న జింబాబ్వే
ఆస్ట్రేలియాపై సాధించిన ఈ ఘనవిజయంతో జింబాబ్వే జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. జింబాబ్వే తన మొదటి మ్యాచ్‌లో ఒమన్‌ను 8 వికెట్ల తేడాతో ఓడించగా రెండో మ్యాచ్‌లో కంగారూలను ఓడించి సూపర్-8 వైపు బలమైన అడుగు వేసింది. ఈ ఓటమి తర్వాత ఆస్ట్రేలియాకు సూపర్-8 చేరడం కష్టంగా మారింది. ఇకపై ఆ జట్టు మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ప్రస్తుతం 2 మ్యాచ్‌ల్లో 2 పాయింట్లతో ఆస్ట్రేలియా మూడో స్థానంలో ఉంది. ఇదే గ్రూప్‌లో ఉన్న ఒమన్, ఐర్లాండ్ జట్లు 2 మ్యాచ్‌ల్లో 2 ఓటములతో వరుసగా నాలుగో, ఐదో స్థానాల్లో ఉన్నాయి.
Also Read: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..బిఆర్ఎస్ లో కాస్త జోష్ నింపింది ఆ మాజీ ఎమ్మెల్యేనే !!
జింబాబ్వే చారిత్రాత్మక విజయం
టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఆస్ట్రేలియాపై జింబాబ్వేకు ఇది రెండో విజయం. అంతకుముందు 2007లో ఆ జట్టు ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 169 పరుగుల స్కోరు సాధించింది. జట్టు తరపున బ్రయాన్ బెన్నెట్ 64 పరుగులతో రాణించాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు 146 పరుగులకే ఆలౌట్ కావడంతో జింబాబ్వేకు 23 పరుగుల విజయం దక్కింది.