Suryakumar Yadav : సూపర్ సూర్యకుమార్.. రెండుసార్లు 600 ప్లస్ రన్స్ చేసిన తొలి ప్లేయర్‌గా రికార్డ్
రెండు సీజన్లలో 600కిపైగా పరుగులు చేసిన తొలి ముంబై ఇండియన్స్(Suryakumar Yadav) బ్యాట్స్‌మన్‌గా చరిత్రలో నిలిచారు.
- By Pasha Published Date - 01:44 PM, Tue - 27 May 25

Suryakumar Yadav : ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్ సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నాడు. సోమవారం జైపూర్ వేదికగా పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో 39 బంతుల్లో 57 రన్స్ చేశాడు. ఈ క్రమంలో సచిన్ టెండూల్కర్ 15 ఏళ్ల రికార్డును సూర్యకుమార్ బద్దలు కొట్టాడు. ఒక ఐపీఎల్ సీజన్‌లో ముంబై తరఫున అత్యధిక రన్స్ చేసిన రికార్డు ఇప్పటిదాకా సచిన్ పేరిట ఉండేది. ఇక నుంచి అది సూర్యకుమార్ పేరుకు మారిపోయింది. 2010 ఐపీఎల్ సీజన్‌లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 618 రన్స్ చేశాడు. సూర్యకుమార్ ఏకంగా రెండోసారి కూడా 600కుపైగా రన్స్ చేసి, సచిన్ కంటే ఒక అడుగు ముందుకు వెళ్లిపోయారు.ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటిదాకా ఆయన 640 రన్స్ చేశాడు. 2023 ఐపీఎల్ సీజన్‌లోనూ సూర్యకుమార్ 605 పరుగులు చేశాడు. తద్వారా ఇప్పటివరకు ఎవ్వరూ చేయలేని విధంగా, రెండు సీజన్లలో 600కిపైగా పరుగులు చేసిన తొలి ముంబై ఇండియన్స్(Suryakumar Yadav) బ్యాట్స్‌మన్‌గా చరిత్రలో నిలిచారు.
Also Read :Sandeep Reddy Vanga: ‘స్పిరిట్’ నుంచి దీపిక ఔట్.. సందీప్ ఎమోషనల్ ట్వీట్
స్ట్రైక్ రేట్ 167.97
సూర్యకుమార్ యాదవ్ ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు 14 మ్యాచ్‌లలో 14 ఇన్నింగ్స్‌లు ఆడి 71.11 సగటుతో మొత్తం 640 రన్స్ చేశాడు. ఇందులో 5 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యుత్తమ స్కోర్ అజేయంగా 73 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 167.97గా ఉంది. ఐపీఎల్ 2025లో సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ అద్భుతంగా రన్‌లు కురిపిస్తోంది. ఆయన ప్రదర్శన ముంబైకి మళ్లీ విజయాలను అందించే దిశగా ఆశాజనకంగా ఉంది.
Also Read :Who is Brigitte Macron : చెంప ఛెల్లుమనిపించిన ఫ్రాన్స్ అధ్యక్షుడి భార్య గురించి తెలుసా ?
అయినా.. పంజాబ్ కింగ్స్‌దే విజయం
సోమవారం జరిగిన మ్యాచ్ విషయానికొస్తే.. ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. 185 పరుగుల లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 18.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఏడు వికెట్ల తేడాతో ముంబైని ఓడించింది. పంజాబ్ బ్యాటర్లలో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (62), జోష్ ఇంగ్లిస్ (73) హాఫ్ సెంచరీలతో జట్టుకు విజయాన్ని అందించారు.