HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Deepika Padukones Exit From Spirit Creates Uproar Sandeep Reddy Vanga Reacts Strongly

Sandeep Reddy Vanga: ‘స్పిరిట్’ నుంచి దీపిక ఔట్.. సందీప్ ఎమోషనల్‌ ట్వీట్

ఈ సారి కేవలం తమ పాత్ర గురించే కాకుండా పూర్తి సినిమా గురించి అడిగినా చెబుతా’’ అని సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) చెప్పుకొచ్చారు.

  • By Pasha Published Date - 01:17 PM, Tue - 27 May 25
  • daily-hunt
Sandeep Reddy Vanga Deepika Padukone Spirit Movie Triptii Dimri

Sandeep Reddy Vanga:  ‘స్పిరిట్’ (Spirit) మూవీ ప్రాజెక్ట్ నుంచి దీపికా పదుకునే తప్పుకున్న అంశంపై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఎమోషనల్‌గా స్పందించారు. ఎవరి పేరూ ప్రస్తావించకుండా ఆయన ఒక ట్వీట్‌ చేశారు. అయితే ఈ ట్వీట్ దీపికను ఉద్దేశించిందే అని అందరూ అనుకుంటున్నారు. ఈ ట్వీట్‌లో.. ‘‘నువ్వు నిజంగా ఎలాంటి వ్యక్తివో చూపించావు, ధన్యవాదాలు. నీపై ఎవరికీ ఋణం లేదు.. అందుకే నిన్ను పడగొట్టే శక్తి కూడా ఎవరికీ లేదు’’ అని సందీప్ వ్యాఖ్యానించారు. ‘‘ఎవరికైనా ఓ కథను చెప్పినప్పుడు అవతలి ఆర్టిస్టును నేను నూరు శాతం విశ్వసిస్తాను. మా మధ్య ఈ విషయాన్ని మూడో వక్తికి చెప్పకూడదనే ఓ నైతికమైన మాట ఉంటుంది. అయితే ఓ ఫెమినిస్ట్ అయిన నటి దీన్ని ఉల్లంఘించింది. ఓ దర్శకుడు తన సినిమా కథను తయారు చేయడానికి ఎంత కష్టపడతాడో ఇలాంటి వ్యక్తులకు ఎప్పటికీ తెలియదు. నేను చెప్పిన సన్నివేశాలను లీక్ చేయడం వల్ల నాకేమీ నష్టం లేదు. ఈ సారి కేవలం తమ పాత్ర గురించే కాకుండా పూర్తి సినిమా గురించి అడిగినా చెబుతా’’ అని సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) చెప్పుకొచ్చారు.

When I narrate a story to an actor, I place 100% faith. There is an unsaid NDA(Non Disclosure Agreement) between us. But by doing this, You’ve ‘DISCLOSED’ the person that you are….
Putting down a Younger actor and ousting my story? Is this what your feminism stands for ? As a…

— Sandeep Reddy Vanga (@imvangasandeep) May 26, 2025

Also Read :Who is Brigitte Macron : చెంప ఛెల్లుమనిపించిన ఫ్రాన్స్‌ అధ్యక్షుడి భార్య గురించి తెలుసా ?

స్పిరిట్ హీరోయిన్‌గా తృప్తి దిమ్రి

ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్నారు. షూటింగ్ మొదలుకాక ముందే  దీపిక తప్పుకోవడంతో, ఈ  సినిమా చుట్టూ పలు ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ మూవీలో కొన్ని బోల్డ్, ఇంటెన్స్ సీన్లు ఉంటాయని, దీపిక అందులో కంఫర్ట్‌గా ఫీలవ్వలేదనే వార్తలు బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతోపాటు పని గంటలు, కొన్ని డిమాండ్స్ విషయంలోనూ దీపిక అంగీకారానికి రాలేదని తెలిసింది. ఫలితంగా ఈ మూవీ ప్రాజెక్టు నుంచి దీపిక తప్పుకున్నట్లు తెలుస్తోంది.దీపికా తప్పుకున్న తర్వాత, ఆమె స్థానంలో తృప్తి దిమ్రిని తీసుకున్నారు. గతంలో బుల్బుల్, అనిమల్ సినిమాల్లో తృప్తి నటించారు. ఈ సినిమా కోసం తృప్తి దిమ్రికి రూ.4కోట్ల పారితోషికం ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇంతకుముందు దీపిక మాత్రం రూ.21 కోట్లు డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. స్పిరిట్ ఒక శక్తివంతమైన యాక్షన్ డ్రామా సినిమా. ఇందులో భావోద్వేగాలు, బోల్డ్ సన్నివేశాలు ఉంటాయనే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు ‘ఎ’ సర్టిఫికెట్ వచ్చే ఛాన్స్ ఉంది.

Also Read :Asaduddin Owaisi : చైనా ఆర్మీ డ్రిల్ ఫొటోతో నాటకాలు.. పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్‌లపై ఒవైసీ ఫైర్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • deepika padukone
  • Sandeep Reddy Vanga
  • Spirit
  • Spirit movie
  • Triptii Dimri

Related News

    Latest News

    • TTD Chairman: టీటీడీ ఛైర్మన్ కీల‌క వ్యాఖ్య‌లు.. మూడు గంట‌ల్లోనే శ్రీవారి ద‌ర్శ‌నం!

    • Coconut Oil: రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనె రాస్తే ఈ అద్భుత ప్రయోజనాలు మీ సొంతం!

    • Virat Kohli- Rohit Sharma: విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల‌కు బిగ్ షాక్‌!

    • Best Laptops: రూ. 30 వేలు ఉంటే.. ఈ ల్యాప్‌టాప్‌లు మీ సొంతం!

    • Parliament Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు!

    Trending News

      • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

      • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

      • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

      • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

      • U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd