Shubman Gill: టీమిండియాకు గుడ్ న్యూస్.. అహ్మదాబాద్ చేరుకున్న గిల్..!
ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు భారత జట్టు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) అహ్మదాబాద్ చేరుకున్నాడు. గిల్ బుధవారం రాత్రి అహ్మదాబాద్ చేరుకున్నాడు.
- By Gopichand Published Date - 04:23 PM, Thu - 12 October 23

Shubman Gill: ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ముందు భారత జట్టు ఓపెనర్ శుభ్‌మన్ గిల్ (Shubman Gill) అహ్మదాబాద్ చేరుకున్నాడు. గిల్ బుధవారం రాత్రి అహ్మదాబాద్ చేరుకున్నాడు. అక్టోబర్ 14న భారత్-పాకిస్థాన్‌ల మధ్య ప్రపంచకప్ పోరు జరగనున్న సంగతి తెలిసిందే. అంటే మళ్లీ ఫిట్‌నెస్ సాధించేందుకు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. గిల్ ఫిట్‌గా మారితే పాకిస్థాన్‌తో ఆడడం ఖాయం. అహ్మదాబాద్‌లో శనివారం భారత్-పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. ప్రపంచకప్ 2023లో జరిగే ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
డెంగ్యూ కారణంగా గిల్.. టీం ఇండియా తరఫున తొలి రెండు మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. ఒక నివేదిక ప్రకారం.. గిల్ అహ్మదాబాద్ చేరుకున్నాడని, ప్రాక్టీస్ ప్రారంభించవచ్చని పేర్కొంది. అయితే దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం వెల్లడి కాలేదు. అయితే వైద్య బృందం నివేదిక వచ్చిన తర్వాతే దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, డెంగ్యూ నుంచి గిల్ కోలుకున్నాడు. ఈ కారణంగా చెన్నైలోని ఆసుపత్రిలో ఒకరోజు ఉండాల్సి వచ్చి అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా పాల్గొనలేదు.
We’re now on WhatsApp. Click to Join.
Arrival of Shubman Gill in Ahmedabad. (Vipul Kashyap).
– Hope we get to see Gill soon in action…!!!pic.twitter.com/j5DDZpYlHj
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 11, 2023
టీమ్ ఇండియా అత్యుత్తమ ఆటగాళ్లలో శుభ్‌మన్ ఒకడు. చాలా సందర్భాలలో అద్భుతంగా రాణించాడు. ఇప్పటి వరకు ఆడిన 35 వన్డే మ్యాచ్‌ల్లో గిల్ 1917 పరుగులు చేశాడు. ఈ సమయంలో గిల్ 6 సెంచరీలు, 9 అర్ధ సెంచరీలు సాధించాడు. వన్డేల్లో గిల్ అత్యుత్తమ స్కోరు 208 పరుగులు. డబుల్ సెంచరీ కూడా సాధించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో శుభ్‌మన్ అద్భుత ప్రదర్శన చేశాడు. ఇండోర్ వన్డేలో సెంచరీ సాధించాడు. అంతకుముందు మొహాలీలో 74 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. అతను ఫిట్‌గా ఉన్న తర్వాత మళ్లీ మైదానంలోకి వస్తే అది భారత్‌కు పెద్ద ప్లస్ పాయింట్ అవుతుంది.
Also Read: World Cup 2023: పసికూన కాదు.. భారత బౌలింగ్ మెరుగుపడాల్సిందే..
ఈ ఏడాది శుభ్‌మన్ గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ఇప్పటి వరకు 20 మ్యాచ్‌లు ఆడి 72 సగటుతో 1230 పరుగులు చేశాడు. అతని స్ట్రైక్ రేట్ కూడా 105 కంటే ఎక్కువగా ఉంది. 5 సెంచరీలు, అర్ధ సెంచరీలు చేశాడు. BCCI అధికారి ఇండియా టుడేతో మాట్లాడుతూ.. గిల్ పూర్తిగా క్షేమంగా ఉన్నాడు. చెన్నై నుండి అహ్మదాబాద్‌కు బయలుదేరాడు. అయితే గురువారం నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ప్రాక్టీస్ సెషన్‌లో టీమిండియాతో గిల్ పాల్గొంటాడా లేదా అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. అతని కోలుకోవడం బాగానే ఉంది కానీ పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఆడతాడని ఇంకా కచ్చితంగా చెప్పలేమని పేర్కొన్నారు.
భారతీయ ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే కూడా డెంగ్యూ బారిన పడ్డారు. అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌కు హర్ష దూరం కానున్నాడు. భారతీయ వ్యాఖ్యాత ట్విట్టర్ ద్వారా ఈ సమాచారాన్ని పంచుకున్నారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు దూరమైతునందుకు నిరాశకు గురయ్యానని చెప్పాడు.