IPL 2023: లెజెండ్స్ తో శుభ్‌మన్ గిల్ ని పోల్చిన రాబిన్ ఉతప్ప
యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ఐపీఎల్ లో సత్తా చాటుతున్నాడు. గుజరాత్ టైటాన్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్న గిల్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు.
- By Praveen Aluthuru Published Date - 04:59 PM, Thu - 18 May 23

IPL 2023: యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ ఐపీఎల్ లో సత్తా చాటుతున్నాడు. గుజరాత్ టైటాన్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్న గిల్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. 23 ఏళ్ళ ఈ కుర్ర క్రికెటర్ సీనియర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే పలువురు మాజీలు గిల్ అట తీరుని మెచ్చుకోగా.. తాజాగా మరో టీమిండియా మాజీ క్రికెటర్ గిల్ పై ప్రశంసలు కురిపించారు.
విరాట్ కోహ్లి , సచిన్ టెండూల్కర్ లాంటి గొప్ప ఆటగాళ్లతో గిల్ ని పోల్చారు కేకేఆర్ మాజీ బ్యాట్స్ మెన్ రాబిన్ ఉతప్ప. కోహ్లీ, సచిన్ సామర్ధ్యంతో గిల్ పోటీ పడగలిగే సత్తా ఉందని ఊతప్ప అన్నారు. గిల్ మూడు ఫార్మెట్లో సెంచరీ నమోదు చేశాడని, ఈ ఏడాది జనవరిలో, గిల్ న్యూజిలాండ్‌పై 208 పరుగులు చేయడం ద్వారా వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడైన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడని ఊతప్ప కొనియాడారు. కాగా ఈ ఏడాది ఐపీఎల్ 2023లో గిల్ తన ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. గుజరాత్ కోసం వీరోచితంగా పోరాడుతున్నాడు.
2023 టోర్నీలో గిల్ ఇప్పటివరకు 576 పరుగులు చేశాడు. గిల్‌కు ఇది ఐపీఎల్‌లో అత్యుత్తమ సీజన్. 13 మ్యాచ్‌ల్లో ఒక సెంచరీ, నాలుగు అర్ధసెంచరీలు సాధించాడు. ఇటీవల, సన్‌రైజర్స్‌పై గిల్ తన తొలి ఐపిఎల్ సెంచరీని సాధించాడు. దీంతో ప్రపంచంలోని గొప్ప ఆటగాళ్లు గిల్‌పై ప్రశంసలు కురిపించారు.
ఇదిలా ఉండగా రాబిన్ ఉతప్ప ఆర్ఆర్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ పై ప్రశంసలు కురిపించారు. యశస్వి ఈ సీజన్‌లో ఇప్పటివరకు 47.92 సగటుతో 575 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలో కేకేఆర్ పై వేగవంతమైన అర్ధ సెంచరీని నమోదు చేశాడు.
Read More: Never Give Up: వెల్ డన్ గర్ల్.. కీప్ ఇట్ అప్, భారీ వర్షంలోనూ ఆగని పరుగు!