Shubman Gill: విరాట్ కోహ్లీ మరో రికార్డు ఔట్.. గిల్ ఖాతాలో ఇంకెన్నో!
రెండవ రోజు ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ 387 పరుగులకు ముగిసింది. ఇంగ్లండ్ తరఫున జో రూట్ అత్యధికంగా 104 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇది రూట్ టెస్ట్ క్రికెట్‌లో 37వ సెంచరీ.
- By Gopichand Published Date - 08:40 AM, Sat - 12 July 25

Shubman Gill: టీమిండియా ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ (Shubman Gill) నాయకత్వంలో ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. అక్కడ రెండు జట్ల మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది. సిరీస్‌లోని మూడవ మ్యాచ్ లార్డ్స్‌లో జరుగుతోంది. ఈ మ్యాచ్‌ను గెలిచి రెండు జట్లు సిరీస్‌లో 2-1తో ఆధిక్యం సాధించాలని కోరుకుంటున్నాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆ తర్వాత మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 387 పరుగులు చేసింది. అయితే, లార్డ్స్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ విఫలమయ్యాడు. అయినప్పటికీ అతను టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక ప్రత్యేక రికార్డును బద్దలు కొట్టాడు.
శుభ్‌మన్ గిల్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు
లార్డ్స్ టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ విఫలమయ్యాడు. రెండవ రోజు అతని బ్యాట్ నుంచి కేవలం 16 పరుగులు మాత్రమే వచ్చాయి. అయితే, మొదటి ఇన్నింగ్స్‌లో 9 పరుగులు చేసిన వెంటనే గిల్ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు.
Also Read: Relationship: అమ్మాయిలకు అలర్ట్.. ఇలాంటి అబ్బాయిలకు దూరంగా ఉండండి!
శుభ్‌మన్ గిల్ ఇప్పుడు ఇంగ్లండ్‌లో ఒక టెస్ట్ సిరీస్‌లో కెప్టెన్‌గా అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉండేది. అతను 2018 ఇంగ్లండ్ పర్యటనలో కెప్టెన్‌గా 593 పరుగులు చేశాడు. గిల్ మాత్రం ఇప్పటివరకు 601 పరుగులు చేసి విరాట్ రికార్డును బద్ధలు కొట్టాడు.
రెండవ రోజు భారత జట్టు పరిస్థితి ఇదీ
రెండవ రోజు ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్ 387 పరుగులకు ముగిసింది. ఇంగ్లండ్ తరఫున జో రూట్ అత్యధికంగా 104 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇది రూట్ టెస్ట్ క్రికెట్‌లో 37వ సెంచరీ. ఆ తర్వాత రెండవ రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. టీమిండియా తరఫున రెండవ రోజు కేఎల్ రాహుల్ అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించగా, యశస్వీ జైస్వాల్, కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్ రూపంలో టీమ్ ఇండియాకు రెండవ రోజు షాక్‌లు తగిలాయి.