India’s Playing 11: కెనడాతో చివరి లీగ్ మ్యాచ్.. భారత తుది జట్టులో మార్పులు..!
- Author : Naresh Kumar
Date : 15-06-2024 - 10:05 IST
Published By : Hashtagu Telugu Desk
India’s Playing 11: టీ ట్వంటీ వరల్డ్ కప్ లో టీమిండియా (India’s Playing 11) కెనడాతో ఇవాళ తమ చివరి గ్రూప్ స్టేజ్ మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా పలు మార్పులతో బరిలోకి దిగనుంది. మూడు వరుస విజయాలతో ఇప్పటికే సూపర్ 8కు క్వాలిఫై అయిన భారత్.. కొంతమంది స్టార్ ప్లేయర్‌కు రెస్ట్ ఇవ్వాలని భావిస్తోంది. నాకౌట్ స్టేజ్ కు ముందు కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తే బెటర్ అనేది వారి ఆలోచన. రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్‌గా ఆడుతున్న కోహ్లీ మూడు మ్యాచ్‌ల్లో విఫలమయ్యాడు. దీంతో అతనికి కాస్త రెస్ట్ ఇచ్చి.. మైండ్ రిలాక్స్ అయ్యేలా చూడాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. కోహ్లీ ప్లేస్‌లో యశస్వి జైస్వాల్ లేదా సంజు శాంసన్ బరిలోకి దిగే అవకాశముంది.
అలాగే టోర్నీ ఆరంభం నుంచి కీపింగ్ చేస్తున్న రిషభ్ పంత్‌కు కూడా రెస్ట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అతని స్థానంలో సంజు శాంసన్‌ను తీసుకోవాలని అనుకుంటుంది. అలాగే హార్ధిక్ పాండ్యాకు కూడా రెస్ట్ ఇవ్వొచ్చు. మిగిలిన బ్యాటింగ్ ఆర్డర్ లో ఎటువంటి మార్పులు ఉండకపోవచ్చు.ఇక బౌలింగ్ లో స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు సైతం రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. బుమ్రాకు రెస్ట్ ఇచ్చి కుల్దీప్ యాదవ్ లేదా యుజ్వేంద్ర చాహల్‌లలో ఒకరి టీమ్‌లోకి తీసుకుని సూపర్ 8కి మ్యాచ్ ప్రాక్టీస్ కల్పించాలని చూస్తోంది. ఎందుకంటే.. సూపర్ 8 మ్యాచ్‌లన్నీ వెస్టిండీస్‌లో జరుగుతాయి.
Also Read: T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026కి అర్హత సాధించిన అమెరికా..!
అక్కడి పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉండే అవకాశం అన్న నేపథ్యంలో. నేరుగా సూపర్ 8 మ్యాచ్ఒక మ్యాచ్ ప్రాక్టీస్ కోసం ఆడిస్తే బాగుంటుందని టీమ్ మేనేజ్‌మెంట్ ఆలోచన. దీని ప్రకారం చూస్తే తుది జట్టులో కొన్ని మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. వరుస మూడు విజయాలతో సూపర్ 8కు క్వాలిఫై అయిన రోహిత్ సేన భారీ విజయంతో లీగ్ స్టేజ్ ను ఘనంగా ముగించాలని ఫాన్స్ కోరుకుంటున్నారు. కెనడాతో మ్యాచ్ ముగిసిన తర్వాత భారత జట్టు కరేబియన్ దీవులకు బయలుదేరుతుంది. అక్కడే సూపర్ 8 , సెమీఫైనల్ , ఫైనల్స్ జరుగుతాయి.
We’re now on WhatsApp : Click to Join