RCB: ఐపీఎల్ 2025 రీషెడ్యూల్.. ఆర్‌సీబీకి బిగ్ షాక్?
ESPN క్రిక్‌ఇన్ఫోలో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. జోష్ హాజెల్‌వుడ్ IPL 2025లో తిరిగి ఆడటంపై అనిశ్చితి నెలకొని ఉంది. హాజెల్‌వుడ్.. భుజం నొప్పి సమస్య కారణంగా మే 3న CSKతో జరిగిన మ్యాచ్‌లో ఆడలేకపోయాడు.
- By Gopichand Published Date - 10:31 PM, Sun - 11 May 25

RCB: మే 8న ఢిల్లీ క్యాపిటల్స్ vs పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌ను భద్రతా కారణాలతో నిలిపివేశారు. ఆ తర్వాత IPL 2025ని ఒక వారం పాటు సస్పెండ్ చేశారు. కానీ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే టోర్నమెంట్‌ను మళ్లీ ఎప్పుడు ప్రారంభిస్తారు. ఇప్పటివరకు BCCI ఎలాంటి షెడ్యూల్‌ను విడుదల చేయలేదు. కానీ టోర్నమెంట్ మళ్లీ ప్రారంభమయ్యే తేదీని గురించి వివిధ రకాల ఊహాగానాలు వస్తున్నాయి. ఈ సమయంలో ఒక మీడియా నివేదికలో వెల్లడైన సమాచారం ప్రకారం ఆర్‌సీబీకి (RCB) చాలా పెద్ద ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఎందుకంటే జోష్ హాజెల్‌వుడ్ మిగిలిన టోర్నమెంట్ నుంచి దూరం కావొచ్చు అని సమాచారం.
RCBకి పెద్ద ఎదురుదెబ్బ
ESPN క్రిక్‌ఇన్ఫోలో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. జోష్ హాజెల్‌వుడ్ IPL 2025లో తిరిగి ఆడటంపై అనిశ్చితి నెలకొని ఉంది. హాజెల్‌వుడ్.. భుజం నొప్పి సమస్య కారణంగా మే 3న CSKతో జరిగిన మ్యాచ్‌లో ఆడలేకపోయాడు. IPL 2025 సస్పెండ్ కాకపోయినా హాజెల్‌వుడ్ మిగిలిన మ్యాచ్‌లను మిస్ చేసే అవకాశం ఉంది. హాజెల్‌వుడ్ గతంలో కూడా గాయాలతో సతమతమయ్యాడు. దీని కారణంగా అతను బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో కొన్ని మ్యాచ్‌ల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. IPL 2025 ప్రారంభ దశలో అతను రిహాబ్ ప్రక్రియను కొనసాగించాడు. అదే నివేదిక ప్రకారం.. క్రికెట్ ఆస్ట్రేలియా హాజెల్‌వుడ్ గాయం పట్ల ఎక్కువ ఆందోళన వ్యక్తం చేయలేదు. హాజెల్‌వుడ్ జూన్ మొదటి వారంలో UKలో జరిగే కండీషనింగ్ క్యాంప్‌లో భాగం అవుతాడని ఆస్ట్రేలియన్ బోర్డ్ ఆశిస్తోంది.
Also Read: Virat Kohli Test Retirement: టెస్టులకు విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అంటూ పోస్ట్.. అసలు నిజమిదే!
IPL 2025లో పర్పుల్ క్యాప్ రేసులో
RCB ఆటగాళ్లు IPL 2025లో ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ రేసులో కూడా ఉన్నారు. ఒకవైపు విరాట్ కోహ్లీ 505 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో నిలిచాడు. మరోవైపు జోష్ హాజెల్‌వుడ్ ప్రస్తుతం RCB తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్. హాజెల్‌వుడ్ ఇప్పటివరకు 10 మ్యాచ్‌లలో 18 వికెట్లు సాధించాడు.
IPL 2025 పునఃప్రారంభం గురించి
BCCI ఇంకా అధికారిక షెడ్యూల్‌ను ప్రకటించలేదు. కానీ కొన్ని మీడియా నివేదికల ప్రకారం IPL మళ్లీ మే 16 లేదా 17 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఫైనల్ మ్యాచ్ మే 30న జరగవచ్చు. మిగిలిన 16 మ్యాచ్‌లను పూర్తి చేయడానికి డబుల్-హెడర్‌లను ఉపయోగించాలని BCCI యోచిస్తోంది.