Shoaib Malik On Divorce Rumours: సానియా మీర్జాతో విడాకులపై స్పందించిన షోయబ్ మాలిక్.. ఏం చెప్పాడంటే..?
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania Mirza), పాకిస్థాన్ క్రికెట్ స్టార్ షోయబ్ మాలిక్ (Shoaib Malik)లకు సంబంధించిన విడాకుల వార్తల (Divorce Rumours)పై షోయబ్ మాలిక్ తొలిసారి స్పందించాడు.
- By Gopichand Published Date - 07:00 AM, Tue - 25 April 23

Shoaib Malik On Divorce Rumours: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా (Sania Mirza), పాకిస్థాన్ క్రికెట్ స్టార్ షోయబ్ మాలిక్ (Shoaib Malik)లకు సంబంధించిన విడాకుల వార్తల (Divorce Rumours)పై షోయబ్ మాలిక్ తొలిసారి స్పందించాడు. వీరిద్దరూ త్వరలో విడిపోవచ్చని చాలా మీడియా కథనాలు పేర్కొన్నాయి. సానియా మీర్జా, షోయబ్ మాలిక్ 2013లో పెళ్లి చేసుకున్నారు. అదే సమయంలో ఇద్దరూ విడాకులు తీసుకోవచ్చు. ఒకరినొకరు విడిచిపెట్టవచ్చు అని గత సంవత్సరం నుండి ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ నివేదికల మధ్య షోయబ్ మాలిక్ మౌనం వీడాడు.
జియో న్యూస్ షో ‘స్కోర్’లో సానియామీర్జాతో విడాకుల వార్తల నేపథ్యంలో ఆమె భర్త షోయబ్ మాలిక్ స్పందించాడు. ‘‘సానియాతో కలిసి ఉండేందుకు ప్రొఫెషనల్ ఒప్పందాల వల్ల వీలు దొరకట్లేదు. దీనివల్లే ఇటీవల ఈద్‌కు కూడా కలవలేదు. మా ఇద్దరిలో ఎవరికి సమయం చిక్కినా ఇరు దేశాలకు వచ్చి వెళ్తుంటాం. భారత్-పాక్ మధ్య క్రికెట్ సంబంధాలు మెరుగవ్వాలని కోరుకుంటున్నా’. ఇలాంటి రూమర్స్ మేము పట్టించుకోము’ అని షోయబ్ పేర్కొన్నాడు. మాలిక్ ఇంకా మాట్లాడుతూ.. మేము అలాంటి పుకార్లను పట్టించుకోమన్నారు. మాలిక్ ఈ ప్రకటన తరువాత ప్రస్తుతం ఇద్దరి మధ్య విడాకుల గురించి లేదా విడిపోవడం గురించి ఎటువంటి చర్చ లేదని స్పష్టమైంది. ఇటీవల.. సానియా మీర్జా తన టెన్నిస్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన WTA (మహిళల టెన్నిస్ అసోసియేషన్) దుబాయ్ డ్యూటీ ఫ్రీ ఛాంపియన్‌షిప్‌లో ఆమె తన చివరి ప్రొఫెషనల్ టెన్నిస్ మ్యాచ్ ఆడింది.
Also Read: DC vs SRH: బౌలింగ్ అదుర్స్…బ్యాటింగ్ బెదుర్స్ ఢిల్లీ చేతిలో ఓడిన హైదరాబాద్
సానియా, షోయబ్‌లు 2013 సంవత్సరంలో వివాహం చేసుకున్నారని , 2018 సంవత్సరంలో వారిద్దరికీ ఒక కుమారుడు జన్మించాడు. సానియా మీర్జా సోషల్ మీడియాలో పెట్టిన కొన్ని పోస్టుల తర్వాత ఇద్దరి మధ్య విడాకులు అనే చర్చ తెరపైకి వచ్చింది. సానియా మీర్జా 2023లో ఆస్ట్రేలియన్ ఓపెన్ తర్వాత టెన్నిస్ నుండి రిటైర్ అయ్యింది. 2023లో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మహిళల జట్టుకు మెంటార్‌గా వ్యవహరించింది.