HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Rashid Khan Outraged At Pakistan Massacre In Kabul

పాకిస్తాన్‌పై రషీద్ ఖాన్ ఆగ్రహం.. కాబూల్‌లో మారణహోమం

  • Author : Vamsi Chowdary Korata Date : 17-03-2026 - 10:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rashid Khan lashes out at Pakistan
Rashid Khan lashes out at Pakistan

Rashid Khan  ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులు తీవ్ర విషాదాన్ని నింపాయి. కాబూల్‌లోని ఓ పునరావాస కేంద్రంపై జరిగిన ఈ దాడిలో మృతుల సంఖ్య 400కి చేరినట్లు ఆఫ్ఘన్ ప్రభుత్వం ధ్రువీకరించింది. మరో 250 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటనపై ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది స్పష్టంగా వార్ క్రైమ్ అని మండిపడ్డాడు.

Tonight in Kabul, hope was extinguished at a hospital. Young men seeking treatment were murdered in a bombing by the Pakistani military regime. Mothers waited at the gates, calling their sons’ names. On the 28th night of Ramadan, their lives were cut short. pic.twitter.com/p12617D4de

— Mohammad Nabi (@MohammadNabi007) March 16, 2026

I am deeply saddened by the latest reports of civilian casualties as a result of Pakistani airstrikes in Kabul. Targeting civilian homes, educational facilities or medical infrastructure, either intentional or by mistake, is a war crime. The sheer disregard for human lives,… pic.twitter.com/DbFRRh2qAJ

— Rashid Khan (@rashidkhan_19) March 16, 2026

ఈ ఘటనపై రషీద్ ఖాన్ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) వేదికగా పోస్ట్ పెట్టాడు. “కాబూల్‌లో పాకిస్థాన్ వైమానిక దాడుల వల్ల అమాయక పౌరులు మరణించారన్న వార్త నన్ను తీవ్రంగా కలచివేసింది. పౌరుల ఇళ్లు, విద్యా సంస్థలు, వైద్యశాలలను లక్ష్యంగా చేసుకోవడం, అది ఉద్దేశపూర్వకంగా అయినా లేదా పొరపాటున జరిగినా యుద్ధ నేరమే అవుతుంది. పవిత్ర రంజాన్ మాసంలో మానవ ప్రాణాలంటే ఏమాత్రం లెక్కలేకుండా ప్రవర్తించడం వికారం పుట్టిస్తోంది” అని పేర్కొన్నాడు.

ఈ చర్య కేవలం విద్వేషాన్ని, విభజనను మాత్రమే పెంచుతుందని రషీద్ తెలిపాడు. “ఈ దారుణంపై ఐక్యరాజ్యసమితి, ఇతర మానవ హక్కుల సంస్థలు సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులను శిక్షించాలని నేను కోరుతున్నాను. ఈ కష్టకాలంలో నేను నా ఆఫ్ఘన్ ప్రజలతోనే ఉంటాను. మనం కోలుకుంటాం, ఒక దేశంగా మళ్లీ నిలబడతాం” అని తన పోస్టులో రాసుకొచ్చాడు.

నబీ తీవ్ర ఆవేదన
ఈ దాడిపై ఆఫ్ఘన్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ కూడా తీవ్రంగా స్పందించాడు. “ఈ రాత్రి కాబూల్‌లోని ఆసుపత్రిలో ఆశలు ఆవిరైపోయాయి. చికిత్స కోసం వచ్చిన యువకులను పాకిస్థాన్ సైనిక పాలన బాంబులతో హత్య చేసింది. తల్లులు గేట్ల వద్ద తమ కుమారుల పేర్లను పిలుస్తూ ఎదురుచూశారు. రంజాన్ 28వ రాత్రి వారి జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోయాయి” అంటూ నబీ ఆవేదనతో కూడిన పోస్ట్ చేశాడు. ఆఫ్ఘన్ ప్రభుత్వ ప్రతినిధి ప్రకారం ఈ దాడి మాదకద్రవ్యాల బాధితులకు చికిత్స అందించే పునరావాస ఆసుపత్రిపై జరిగింది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Afghanistan
  • human rights
  • Kabul airstrike
  • Mohammad Nabi
  • pakistan
  • rashid khan
  • taliban
  • UN investigation

Related News

Rashid Khan Lashes Out At P

Rashid Khan : పాకిస్తాన్‌పై రషీద్ ఖాన్ ఆగ్రహం

కాబూల్‌లోని డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్ (పునరావాస కేంద్రం) లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో సుమారు 400 మంది ప్రాణాలు కోల్పోవడంపై రషీద్ ఖాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు

    Latest News

    • AP Govt : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ – ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీలో రాయితీ

    • ఏపీలో ఆస్తి పన్ను చెల్లింపుదారులకు బంపర్ ఆఫర్

    • Drugs Case : రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ షోకాజ్ నోటీస్

    • Gold Prices: పెరుగుతున్న బంగారం ధరలు

    • కూకట్‌పల్లిలో భారీ దోపిడీ.. కారంపొడి చల్లి కోటి రూపాయలు దోచుకెళ్లిన దుండగులు!

    Trending News

      • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

      • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

      • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

      • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

      • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd