Sehwag On Dhoni: అక్కడ ఉన్నది ధోనీ…చెన్నై ప్లే ఆఫ్ చేరడం పక్కా – సెహ్వాగ్
ఐపీఎల్ 15వ సీజన్ ప్లేఆఫ్స్ రేసులో కాస్త వెనుకంజలో ఉన్నట్లు కనిపించిన చెన్నై సూపర్ కింగ్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయంతో ఒక్కసారిగా మళ్లీ రేసులోకి దూసుకొచ్చింది.
- By Naresh Kumar Updated On - 02:37 PM, Tue - 3 May 22

ఐపీఎల్ 15వ సీజన్ ప్లేఆఫ్స్ రేసులో కాస్త వెనుకంజలో ఉన్నట్లు కనిపించిన చెన్నై సూపర్ కింగ్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయంతో ఒక్కసారిగా మళ్లీ రేసులోకి దూసుకొచ్చింది. చెన్నై సూపర్ కింగ్స్ సారథ్య బాధ్యతలు చేపట్టిన ధోనీ.. గత మ్యాచ్ లో జట్టుని విజయవంతంగా ముందుకు నడిపించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్.. ఎంస్ ధోని గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు..ధోని సారథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుస విజయాలు సాధించి ప్లే ఆఫ్స్ చేరుకుంటుందని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు.
ఈ అంశంపై తాజాగా ఓ కార్యక్రమంలో సెహ్వాగ్ మాట్లాడుతూ.. సుదీర్ఘ కాలం ధోనీతో కలిసి ఆడాను. అతడి సారథ్యంలో టీమిండియా అద్భుత విజయాలు సాధించింది. ఐసీసీ ఈవెంటల్లో కూడా ఓడిపోతామనుకున్న ఎన్నో మ్యాచులను ధోనీ ఒంటిచేత్తో గెలిపించాడు. ఇవన్నీ తలుచుకుంటుంటే ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుస మ్యాచ్‌లలో విజయం సాధించి ఈసారి కూడా ట్రోఫీ గెలుస్తుందని అనిపిస్తున్నట్లు సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ 2022 సీజన్ లో ఇప్పటి వరకు 9 మ్యాచ్‌లు ఆడిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కేవలం 3 మ్యాచుల్లో మాత్రమే విజయం సాధించింది. దాంతోపాయింట్స్ టేబుల్ లో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. మిగిలి ఉన్న ఐదు మ్యాచ్‌లలో గెలిస్తే మొత్తంగా 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ చేరే అవకాశం ఉంటుంది.
Related News

Gautam Angry Celebration: లక్నో డగౌట్ లో గంభీర్ ఎమోషనల్
ఐపీఎల్ 2022 సీజన్ లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఉత్కంఠ భరితంగా సాగినమ్యాచ్‌లో లక్నోజట్టు 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. చివరి బంతి వరకూ ఫాన్స్ ను ఉత్కంఠతో ఊపేసింది.