Sachin Meets Messi: మెస్సీని కలిసిన సచిన్ టెండూల్కర్.. వీడియో వైరల్!
లియోనెల్ మెస్సీ డిసెంబర్ 13న కోల్‌కతా చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్‌లో రాహుల్ గాంధీని కలిసి, ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో కూడా పాల్గొన్నారు. నేడు ఆయన ముంబైకి చేరుకున్నారు. రేపు అంటే డిసెంబర్ 15న ఆయన ఢిల్లీకి వెళతారు.
- Author : Gopichand
Date : 14-12-2025 - 9:33 IST
Published By : Hashtagu Telugu Desk
Sachin Meets Messi: క్రీడా ప్రపంచంలో ’10 నంబర్ జెర్సీ’ కి గుర్తింపు తెచ్చిన ఇద్దరు దిగ్గజ అథ్లెట్లు కలుసుకున్నారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్, లియోనెల్ మెస్సీ (Sachin Meets Messi) ఒకరినొకరు కలుసుకున్నారు. ఈ సందర్భంగా సచిన్ తన క్రికెట్ జెర్సీని మెస్సీకి బహుమతిగా ఇచ్చారు. ఇది క్రికెట్, ఫుట్‌బాల్ చరిత్రలో ఒక చారిత్రక క్షణంగా నిలిచింది. లియోనెల్ మెస్సీ వాంఖడే స్టేడియంలో భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ సునీల్ ఛెత్రిని కలిశారు. ఆ తర్వాత మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఆపై ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ టెండూల్కర్‌ను కలిశారు. వారిద్దరూ కొంతసేపు మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.
సచిన్ టెండూల్కర్ తన 2011 వన్డే ప్రపంచ కప్ జెర్సీని మెస్సీకి బహుమతిగా ఇచ్చారు. కాగా అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం తన 2022 ప్రపంచ కప్ బాల్‌ను సచిన్ టెండూల్కర్‌కు బహుమతిగా ఇచ్చారు. సచిన్ టెండూల్కర్ ఏం మాట్లాడుతున్నారో మెస్సీకి అర్థం కావడానికి, ఆయనతో పాటు ఒక అనువాదకురాలు (ట్రాన్స్‌లేటర్) కూడా ఉన్నారు.
Also Read: IND U19 vs PAK U19: పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం!
VIDEO | Maharashtra: Amid loud cheers, Indian cricket legend Sachin Tendulkar gifts Argentine football icon Lionel Messi the 2011 World Cup jersey, calling it a golden moment for Mumbai and India.
(Source: Third Party)
(Full VIDEO available on PTI Videos –… pic.twitter.com/GKIqReBoqa
— Press Trust of India (@PTI_News) December 14, 2025
సచిన్ టెండూల్కర్ ఏమన్నారంటే?
లియోనెల్ మెస్సీ భారత్‌కు రావడంపై ఆయన అభిప్రాయం ఏమిటని సచిన్ టెండూల్కర్‌ను అడిగినప్పుడు ఆయన ఇలా అన్నారు. మేము లియోనెల్ మెస్సీ అంకితభావం, పట్టుదల, నిబద్ధతను గౌరవిస్తాము. ఆయన వినయపూర్వకమైన స్వభావం కారణంగా ఎలాంటి వ్యక్తిగా ఉన్నారో, అందుకోసం ఆయనను చాలా ఎక్కువగా అభిమానిస్తారు. ముంబై, భారత ప్రజల తరపున మెస్సీ అతని కుటుంబం సంతోషంగా, మంచి ఆరోగ్యంతో ఉండాలని నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు.
మెస్సీ ఇండియా టూర్ షెడ్యూల్
లియోనెల్ మెస్సీ డిసెంబర్ 13న కోల్‌కతా చేరుకున్నారు. ఆ తర్వాత ఆయన హైదరాబాద్‌లో రాహుల్ గాంధీని కలిసి, ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో కూడా పాల్గొన్నారు. నేడు ఆయన ముంబైకి చేరుకున్నారు. రేపు అంటే డిసెంబర్ 15న ఆయన ఢిల్లీకి వెళతారు.