Sachin Tendulkar: పాకిస్తాన్ తరుపున ఆడిన సచిన్
మరో వందేళ్ల తర్వాతైనా క్రికెట్ గురించి మాట్లాడాల్సి వస్తే, ముందుగా సచిన్ టెండూల్కర్ పేరు గుర్తుకు వస్తుంది. వన్డేల్లో మొట్టమొదటి డబుల్ సెంచరీ
- By Praveen Aluthuru Published Date - 08:00 PM, Thu - 10 August 23

Sachin Tendulkar: మరో వందేళ్ల తర్వాతైనా క్రికెట్ గురించి మాట్లాడాల్సి వస్తే, ముందుగా సచిన్ టెండూల్కర్ పేరు గుర్తుకు వస్తుంది. వన్డేల్లో మొట్టమొదటి డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్‌గా, 100 సెంచరీలు, లెక్కకి మించి రికార్డులు సాధించిన లిటిల్ మాస్టర్ కెరీర్ ఆరంభంలో పాకిస్తాన్ తరుపున ఆడాడనే విషయం చాలామందికి తెలీదు.సచిన్ 1989 నవంబర్ 15న అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. కరాచీ నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో మన లిటిల్ మాస్టర్ తన తొలి టెస్టుని ఆడాడు అంతకుముందు 1987లో క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా తో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ప్లేయర్లు జాబేద్ మీయాంధర్, అబ్దుల్ ఖాదిర్ లంచ్ బ్రేక్లో మైదానాన్ని వీడటంతో సచిన్ టెండూల్కర్ స్టాండ్ బై ఫీల్డర్ గా పాకిస్తాన్ తరఫున మైదానంలోకి వచ్చాడు. అప్పుడు సచిన్ వయసు 14 ఏళ్ళే. అప్పుడు పాకిస్థాన్ కెప్టెన్ గా ఇమ్రాన్ ఖాన్ వ్యవహరిస్తున్నాడు.
సచిన్ టీమిండియా తరపున మొత్తం 664 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. 782 ఇన్నింగ్స్‌లలో 48.52 సగటుతో 34357 పరుగులు చేశాడు. ఇందులో 100 సెంచరీలు, 164 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Also Read: Janasena Merge BJP: జనసేన లోకి చిరు.. పాల్ జోస్యం