Janasena Merge BJP: జనసేన లోకి చిరు.. పాల్ జోస్యం
జనసేనపై విమర్శలు కురిపించే కేఏ పాల్ తాజాగా జనసేన పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవిపై హాట్ కామెంట్స్ చేశారు. అంతకుముందు చిరంజీవి వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసిన విషయం తెలిసిందే
- Author : Praveen Aluthuru
Date : 10-08-2023 - 6:47 IST
Published By : Hashtagu Telugu Desk
Janasena Merge BJP: జనసేనపై విమర్శలు కురిపించే కేఏ పాల్ తాజాగా పవన్ కళ్యాణ్ సోదరుడు చిరంజీవిపై హాట్ కామెంట్స్ చేశారు. అంతకుముందు చిరంజీవి వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసిన విషయం తెలిసిందే. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని, పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినిమా వాళ్లపై పడతారేంటని కామెంట్స్ చేశారు. దానికి వైసీపీ నుంచి దీటుగా విమర్శలు ఎదుర్కొన్నారు చిరంజీవి.
నన్ను బ్రో సినిమాలో చూపించారు కాబట్టే నేను స్పందించానని అన్నారు అంబటి రాయుడు. నను గెలికితే నేనెలా ఉరుకుంటాను అంటూ మండిపడ్డారు. దీంతో వివాదం కొనసాగుతూ వస్తుంది. మరోవైపు గుడివాడలో కొడాలి నానికి వ్యతిరేకంగా చిరంజీవి అభిమానులు నిరసన తెలిపారు. చిరుపై నాని చేసిన వ్యాఖ్యలకు గాను మెగా అభిమానులు నిరసన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా చిరు వైసీపీ ప్రభుత్వంపై చేసిన కామెంట్స్ పై కేఏ పాల్ రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చిరంజీవి జనసేన పార్టీలోకి వెళ్లే సమయం వచ్చిందని అన్నారు. అందుకే ముందుగానే లీకులు ఇస్తున్నాడంటూ వ్యాఖ్యానించారు. ఇక చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశాడని, త్వరలో జనసేన కూడా బీజేపీలో విలీనం అవుతుందంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. గతంలో ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసిన చిరు 5 కోట్లు పొందాడని ఆరోపించారు. ఎన్నికలు అవ్వగానే జనసేన బీజేపీలో విలీనం అవుతుందని సంచలన ఆరోపణలు చేశారు పాల్ . ప్రస్తుతం పవన్ కళ్యాణ్ విశాఖలో వారాహి యాత్ర బిజీలో ఉన్నారు. అయితే విశాఖ వారాహి యాత్ర కేవలం బీజేపీ లబ్ది కోసమేనంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు కేఏ పాల్. దీనిపై చిరంజీవి, పవన్ కల్యాణ్, నాగేంద్రబాబులతో చర్చించేందుకు తాను సిద్ధం అంటూ పాల్ సవాల్ మెగా కుటుంబానికి విసిరారు.
Also Read: YS Sharmila: ట్రిపుల్ ఐటీలో 27 మంది ఆత్మహత్య చేసుకున్న దొరకి చలనం లేదు