వెస్టిండీస్‌పై సౌతాఫ్రికా సూపర్ విక్టరీ.. భారత్‌కు ఊరట!
సౌత్ ఆఫ్రికా 9 వికెట్ల తేడాతో విజయం సాధించడం భారత జట్టుకు పెద్ద ఊరటనిచ్చింది. ఎందుకంటే అంతకుముందున్న సమీకరణాలతో పోలిస్తే ఇప్పుడు భారత్ సెమీఫైనల్ దారి చాలా వరకు సులభమైంది.
- Author : Gopichand
Date : 26-02-2026 - 7:20 IST
Published By : Hashtagu Telugu Desk
SA vs WI: వెస్టిండీస్‌ను సౌత్ ఆఫ్రికా 9 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఎయిడెన్ మార్క్రామ్ కరీబియన్ బౌలర్లను ఊచకోత కోస్తూ 82 పరుగుల శక్తివంతమైన, చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడారు. ఈ విజయంతో సౌత్ ఆఫ్రికా సెమీఫైనల్లో తన స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకుంది. ఆఫ్రికా సాధించిన ఈ విజయం టీమ్ ఇండియాకు కూడా కలిసొచ్చే అంశం.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ చేసింది. వెస్టిండీస్ 83 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కానీ జేసన్ హోల్డర్ (49 పరుగులు), రొమారియో షెపర్డ్ (52 పరుగులు) అద్భుతంగా ఆడారు. హోల్డర్, షెపర్డ్ 89 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి వెస్టిండీస్ స్కోరును 176 పరుగులకు చేర్చారు.
Also Read: విజయ్ దేవరకొండ- రష్మిక పెళ్లి ఫొటోలు ఇవే!
ఎయిడెన్ మార్క్రామ్ విశ్వరూపం
177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికాకు క్వింటన్ డికాక్, ఎయిడెన్ మార్క్రామ్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ కేవలం 8 ఓవర్లలోనే 95 పరుగులు జోడించి వెస్టిండీస్ బౌలింగ్ విభాగం నడ్డి విరిచారు. డికాక్ 24 బంతుల్లో 47 పరుగులు చేయగా, కెప్టెన్ మార్క్రామ్ 82 పరుగులతో అజేయంగా నిలిచారు. తన ఇన్నింగ్స్‌లో ఆయన 7 ఫోర్లు, 4 సిక్సర్లు బాదారు.
వీరితో పాటు ర్యాన్ రికెల్టన్ 45 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఒకవేళ ఈ రోజు సాయంత్రం భారత్ గనుక జింబాబ్వేను ఓడిస్తే సౌత్ ఆఫ్రికా అధికారికంగా సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. మార్క్రామ్ బ్యాటింగ్ సునామీకి ముందు బౌలింగ్‌లో లుంగి ఎన్గిడి 3 వికెట్లు తీసి కరీబియన్ బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బతీశారు. కగిసో రబడ, కార్బిన్ బాష్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
భారత్‌కు ఊరట
సౌత్ ఆఫ్రికా 9 వికెట్ల తేడాతో విజయం సాధించడం భారత జట్టుకు పెద్ద ఊరటనిచ్చింది. ఎందుకంటే అంతకుముందున్న సమీకరణాలతో పోలిస్తే ఇప్పుడు భారత్ సెమీఫైనల్ దారి చాలా వరకు సులభమైంది. ఇప్పుడు టీమ్ ఇండియా సెమీఫైనల్ చేరాలంటే తన తదుపరి రెండు మ్యాచ్‌లను గెలిస్తే సరిపోతుంది.