RR vs MI: రఫ్పాడించిన రాజస్థాన్.. శతక్కొట్టిన జైస్వాల్, ముంబైని చిత్తుగా ఓడించిన ఆర్ఆర్
ఐపీఎల్ 2024లో 38వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ను ఓడించింది.
- Author : Gopichand
Date : 22-04-2024 - 11:55 IST
Published By : Hashtagu Telugu Desk
RR vs MI: ఐపీఎల్ 2024లో 38వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 9 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ (RR vs MI) ను ఓడించింది. రాజస్థాన్ తరఫున యశస్వి జైస్వాల్ 60 బంతుల్లో 104 పరుగులతో అజేయంగా నిలిచాడు. జైస్వాల్ బ్యాటింగ్‌లో 9 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. కాగా కెప్టెన్ సంజూ శాంసన్ 38 పరుగులు చేసి నాటౌట్‌గా వెనుదిరిగాడు. తొలుత ఆడిన ముంబై 179 పరుగులు చేసింది. లక్ష్య చేధనకు దిగిన రాజస్థాన్ మరో ఎనిమిది బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది.
జోస్ బట్లర్ 25 బంతుల్లో 35 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. జైస్వాల్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. జైస్వాల్ 60 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 104 పరుగులు చేశాడు. తొలి 10 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ 1 వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ చేయటానికి ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. కానీ అవి కలిసిరాలేదు. సంజు శాంసన్ 27 బంతుల్లో 38 పరుగులు చేసి RR విజయానికి ముఖ్యమైన సహకారం అందించాడు. చివర్లో జైస్వాల్ ఓ విన్నింగ్ షాట్ కొట్టి 9 వికెట్ల తేడాతో రాజస్థాన్ విజయాన్ని ఖాయం చేశాడు.
Also Read: Harish Rao: దుబ్బాకలో చెల్లని రూపాయి, మెదక్ ఎన్నికల్లో చెల్లుతుందా
అయితే రాజస్థాన్ బ్యాటింగ్ సమయంలో వర్షం ఆటంకం కలిగించింది. వర్షం తర్వాత మళ్లీ మ్యాచ్ ప్రారంభం కాగానే ముంబై ఇండియన్స్ బౌలర్లు ధారళంగా పరుగులు సమర్పించుకున్నారు. ముంబై తరఫున పీయూష్ చావ్లా 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి ఏకైక వికెట్ తీశాడు. ఈ మ్యాచ్‌లో నువాన్ తుషార ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. అయితే అతను కేవలం 3 ఓవర్లలో 28 పరుగులు ఇచ్చాడు.
ఇక అంతకుముందు బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 179 పరుగులు మాత్రమే చేయగలిగింది. ముంబై బ్యాటింగ్‌లో తిలక్ వర్మ (65), వధేరా (49) పరుగులు చేశారు. మిగిలిన ముంబై బ్యాట్స్‌మెన్ ఎవరూ ఈ మ్యాచ్‌లో రాణించలేకపోయారు. రాజస్థాన్ బౌలింగ్‌లో సందీప్ శర్మ 5 వికెట్లతో ముంబైను దెబ్బతీశాడు. సందీప్ తో పాటు బౌల్ట్ 2 వికెట్లు, చాహాల్, అవేశ్ ఖాన్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం 8 మ్యాచ్‌లు ఆడిన రాజస్థాన్ 7 విజయాలతో మొదటి స్థానంలో నిలిచింది.
We’re now on WhatsApp : Click to Join