Rohit Sharma: సరికొత్త చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 41వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్- ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 20 ఓవర్లలో 143 పరుగులు చేసింది.
- By Gopichand Published Date - 11:24 PM, Wed - 23 April 25

Rohit Sharma: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 41వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్- ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 20 ఓవర్లలో 143 పరుగులు చేసింది. 144 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ముంబై తరపున మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) వచ్చీరాగానే విధ్వంసకర షాట్లు ఆడాడు. మ్యాచ్‌లో 12 పరుగులు చేయగానే రోహిత్ ఒక ప్రత్యేక విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
T20 క్రికెట్‌లో 12000 పరుగులు పూర్తి
రోహిత్ శర్మ T20 క్రికెట్‌లో 12000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. విరాట్ కోహ్లీ తర్వాత ఈ విజయాన్ని సాధించిన రెండో భారతీయ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. రోహిత్ తన 456వ T20 మ్యాచ్‌లో 443వ ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. ఇంతకుముందు విరాట్ కోహ్లీ 407 T20 మ్యాచ్‌లలో 390 ఇన్నింగ్స్‌లలో 13208 పరుగులు చేశాడు.
T20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్, అతను 463 T20 మ్యాచ్‌లలో 14562 పరుగులు సాధించాడు. రోహిత్ శర్మ ఇప్పుడు ముంబై ఇండియన్స్ తరపున T20 క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా నిలిచాడు. ఈ విషయంలో అతను కీరన్ పొలార్డ్‌ను వెనక్కి నెట్టాడు. రోహిత్ శర్మ 2016 తర్వాత IPLలో వరుసగా రెండు ఫిఫ్టీలు సాధించాడు. మునుపటి మ్యాచ్‌లో రోహిత్ నాటౌట్‌గా 76 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 46 బంతుల్లో 70 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో 8 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు.
ముంబై తరపున అత్యధిక సిక్సర్లు
- 259 – రోహిత్ శర్మ*
- 258 – కీరన్ పొలార్డ్
- 127 – సూర్యకుమార్ యాదవ్
- 115 – హార్దిక్ పాండ్యా
- 106 – ఇషాన్ కిషన్
అతి తక్కువ బంతుల్లో 12000 T20 పరుగులు
- 7992 – కీరన్ పొలార్డ్
- 8100 – క్రిస్ గేల్
- 8191 – ఆలెక్స్ హేల్స్
- 8261 – జోస్ బట్లర్
- 8563 – డేవిడ్ వార్నర్
- 8885 – రోహిత్ శర్మ
- 8997 – విరాట్ కోహ్లీ
- 9424 – షోయబ్ మాలిక్
Also Read: Mumbai Indians: ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్‌ను చిత్తు చేసిన ముంబై ఇండియన్స్!
అతి వేగంగా 12000 T20 పరుగులు
- 343 ఇన్నింగ్స్ – క్రిస్ గేల్
- 360 ఇన్నింగ్స్ – విరాట్ కోహ్లీ
- 368 ఇన్నింగ్స్ – డేవిడ్ వార్నర్
- 405 ఇన్నింగ్స్ – జోస్ బట్లర్
- 432 ఇన్నింగ్స్ – ఆలెక్స్ హేల్స్
- 443 ఇన్నింగ్స్ – రోహిత్ శర్మ*
- 451 ఇన్నింగ్స్ – షోయబ్ మాలిక్
- 550 ఇన్నింగ్స్ – కీరన్ పొలార్డ్