Rohit Sharma: టీమిండియాకు భారీ షాక్.. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో రెండు మ్యాచ్‌లకు రోహిత్ దూరం!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందే టీమ్ ఇండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరిగే మొదటి లేదా రెండవ టెస్ట్ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది.
- Author : Gopichand
Date : 10-10-2024 - 11:17 IST
Published By : Hashtagu Telugu Desk
Rohit Sharma: ఆస్ట్రేలియా టూర్ ప్రారంభం కాకముందే టీమిండియాకు ఓ బ్యాడ్ న్యూస్ వస్తోంది. భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఆస్ట్రేలియాతో జరిగే మొదటి రెండు టెస్ట్ మ్యాచ్‌లలో ఒక మ్యాచ్‌కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. నివేదిక ప్రకారం.. రోహిత్ మొదటి లేదా రెండవ టెస్ట్ మ్యాచ్‌కు దూరమవుతాడని తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల వల్ల హిట్‌మ్యాన్ టెస్టు మ్యాచ్‌లో కనిపించని, ఈ విషయాన్ని అతడు బీసీసీఐకి తెలియజేసినట్లు సమాచారం.
రోహిత్ రెండు టెస్టులకు దూరమయ్యే అవకాశం ఉంది
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ప్రారంభానికి ముందే టీమ్ ఇండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరిగే మొదటి లేదా రెండవ టెస్ట్ మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉంది. పీటీఐతో బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. పరిస్థితి ఇంకా పూర్తిగా స్పష్టంగా తెలియరాలేదు. వ్యక్తిగత కారణాల వల్ల సిరీస్‌లోని మొదటి లేదా రెండో టెస్టు మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశం ఉందని రోహిత్ బీసీసీఐకి తెలిపినట్లు తెలుస్తోంది. అయితే సిరీస్ ప్రారంభానికి ముందే వ్యక్తిగత విషయాలను పరిష్కరించుకుంటే అతను మొత్తం ఐదు టెస్టులు ఆడే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. రోహిత్ కెప్టెన్సీ, బ్యాటింగ్ చూస్తుంటే టీమ్ ఇండియాకు ఇది శుభవార్త కాదు. ఈ రోజుల్లో టెస్ట్ క్రికెట్‌లో హిట్‌మ్యాన్ బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. అతను ఆస్ట్రేలియా బౌన్సీ పిచ్‌లని ఇష్టపడతాడు.
Also Read: Deputy CM Bhatti: డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీపై డిప్యూటీ సీఎం భట్టి సంచలన వ్యాఖ్యలు
అభిమన్యు.. రోహిత్‌కి ఆప్షన్ కావచ్చు
ఒకవేళ రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ మ్యాచ్‌కు దూరమైతే అతని బ్యాకప్‌గా ఇన్‌ఫామ్ బ్యాట్స్‌మెన్ అభిమన్యు ఈశ్వరన్‌కు జట్టులో స్థానం ఇవ్వబడుతుంది. హిట్‌మ్యాన్ లేకపోవడంతో శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్‌లలో ఒకరికి ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం లభించవచ్చు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ నవంబర్ 22 నుంచి పెర్త్‌లో ప్రారంభం కానుంది. సిరీస్‌లోని రెండో టెస్టు మ్యాచ్ డిసెంబర్ 6 నుంచి అడిలైడ్‌లో జరగనుంది. అదే సమయంలో డిసెంబర్ 18 నుంచి ప్రారంభం కానున్న మూడో టెస్టు మ్యాచ్‌కు బ్రిస్బేన్ ఆతిథ్యం ఇవ్వనుంది. నాలుగో టెస్టు డిసెంబర్ 30 నుంచి మెల్‌బోర్న్‌లో జరగనుండగా, సిరీస్‌లోని చివరి మ్యాచ్ జనవరి 7 నుంచి సిడ్నీలో జరగనుంది.