HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Deputy Cm Bhattis Comments On Dr Abhishek Manu Singhvi

Deputy CM Bhatti: డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీపై డిప్యూటీ సీఎం భ‌ట్టి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ప్రముఖ న్యాయవాది డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపడం చారిత్రాత్మకమైన అవసరం అని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు.

  • Author : Gopi Date : 10-10-2024 - 10:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Deputy CM Bhatti
Deputy CM Bhatti

Deputy CM Bhatti: డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీ ని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపడం చారిత్రాత్మక అవసరం అని తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క (Deputy CM Bhatti) అన్నారు. పెద్దల సభలో తెలంగాణ త‌రపున‌ అభిషేక్ మను సింఘ్వీ ఆయ‌న గొంతుక వినిపంచ‌నున్నారు. భారత రాజ్యాంగం ఔన్నత్యాన్ని కాపాడటంలో విజయం సాధించిన గొప్ప న్యాయవాదిగా సింఘ్వీకి పేరుంది.

ప్రముఖ న్యాయవాది డాక్టర్ అభిషేక్ మను సింఘ్వీని తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపడం చారిత్రాత్మకమైన అవసరం అని తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు. రాజ్యసభ సభ్యులు అభిషేక్ మను సింఘ్వీ ఆత్మీయ అభినందన సత్కార కార్యక్రమాన్ని గురువారం తాజ్ కృష్ణ హోటల్లో మాజీ రాజ్యసభ సభ్యులు గిరీష్ సంఘీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు.

Also Read: Narendra Modi : లావోస్‌లో పర్యటనలో జపాన్ కొత్త ప్రధానిని కలిసిన ప్రధాని మోదీ

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఔన్నత్యాన్ని కాపాడటంలో విజయం సాధించి దేశంలోనే నిష్ణాతులైన గొప్ప న్యాయవాదిగా పేరు ప్రఖ్యాతలు గడించిన అభిషేక్ మను సింఘ్వీ తెలంగాణ ప్రజల గొంతుక గా పెద్దల సభలో తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం తన గళాన్ని వినిపించనున్నారని అన్నారు. కొట్లాడి కోరి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి విభజన చట్టం ద్వారా రావలసిన హక్కులు దశాబ్ద కాలంగా ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని వీటిని చట్టసభల్లో , న్యాయస్థానాల్లో వాదించి రాష్ట్రం గెలవడానికి ఉపయోగపడే వ్యక్తి అభిషేక్ మను సింఘ్వీ తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యులుగా ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందన్నారు. దేశంలో ఉన్న అతి కొద్ది మంది నిష్ణాతులైన న్యాయవాదుల్లో అభిషేక్ మను సింఘ్వీ ఒకరని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడేటువంటి గొప్ప వ్యక్తిని రాజ్యసభ సభ్యులుగా గెలిపించుకోవడానికి ఓటు వేయడం తెలంగాణ కాంగ్రెస్ శాసనసభ పక్షానికి చాలా సంతోషంగా ఉందన్నారు.

క్లిష్టమైన కేసులు వాదించాల్సి వచ్చినప్పుడు వారి వాదనలు వినడానికి, వారు తీసుకొచ్చిన తీర్పులు చూడటానికి దేశ ప్రజలు చాలా ఆసక్తిగా చూసిన సంఘటనలు అనేకం ఉన్నాయని గుర్తు చేశారు. ప్రజల పక్షాన ప్రజాస్వామ్యం నిలబెట్టడం కోసం, చట్టాలను నిలబెట్టడం కోసం సుప్రీంకోర్టు ఇతర న్యాయస్థానాల్లో వారు చేసిన వాదనలు సాధించిన విజయాల అనుభవాలు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడతాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం చట్టసభల్లో వాదించి రాష్ట్రం గెలుపొందాడడానికి ఉపయోగపడే వ్యక్తి అభిషేక్ మను సింఘ్వీ తప్ప మాకు మరొకరు రాజ్యసభ ఎన్నికల్లో తమకు కనిపించలేదన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Abhishek Manu Singhvi
  • cm revanth
  • congress
  • Deputy CM Bhatti
  • hyderabad
  • rajyasabha
  • telangana

Related News

Cobra hatchlings at the police station

Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు

న్యాయం కోసం, రక్షణ కోసం ప్రజలు వెళ్లే పోలీస్ స్టేషన్ ఆవరణ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా మారిపోయింది. శాంతి, భద్రతలను కాపాడాల్సిన పీఎస్ ప్రాంగణంలోకి ఏకంగా విషసర్పాలు చొరబడుతుండటంతో అటు పోలీసులు, ఇటు సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా చోటుచేసుకున్న ఉదంతం నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. స్టేషన్ ప్రా

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

Latest News

  • Chandrababu Naidu: గోదావరి పుష్కరాలకు చంద్రబాబు కీలక ప్రకటన..

  • Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఫ్యాన్స్

  • Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి

  • Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు

  • CSK: 18 సంవత్సరాల ప్రస్థానానికి ముగింపు.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఫ్లెమింగ్ గుడ్​బై..

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd