RR vs GT: గుజరాత్ బౌలర్లని ఉతికారేసిన సంజూ శాంసన్, రియాన్ పరాగ్..
జైపూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ లో రియాన్ పరాగ్, సంజు శాంసన్ విధ్వంసకర ఇన్నింగ్స్ కి తెరలేపారు.
- Author : Praveen Aluthuru
Date : 10-04-2024 - 10:21 IST
Published By : Hashtagu Telugu Desk
RR vs GT: జైపూర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ లో రియాన్ పరాగ్, సంజు శాంసన్ విధ్వంసకర ఇన్నింగ్స్ కి తెరలేపారు. ఆరంభంలో రెండు వికెట్ల పతనం తర్వాత కెప్టెన్ సంజూ శాంసన్, పరాగ్ ఇన్నింగ్స్ బాధ్యత తీసుకుని మ్యాచ్ ని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. వీరిద్దరి మధ్య 130 పరుగుల భాగస్వామ్యం నమోదైంది.
పరాగ్ 48 బంతుల్లో 76 పరుగులు చేసి ఔటయ్యాడు. పరాగ్ ఖాతాలో 3 ఫోర్లు, 5 సిక్సర్లు నమోదయ్యాయి. సంజూ శాంసన్ 38 బంతుల్లో 68 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సంజు ఖాతాలో 7 ఫోర్లు, 2 భారీ సిక్సర్లతో గుజరాత్ బౌలర్లపై విధ్వంసం సృష్టించాడు. అయితే ఓపెనర్ జైస్వాల్ ఈ మ్యాచ్ లో అంచనాలు అందుకోలేకపోయాడు. 19 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ 5 బౌండరీలతో 24 పరుగులు నమోదు చేశాడు.చివర్లో షిమ్రాన్ హెట్మెయర్ 5 బంతుల్లో 13 పరుగులు చేశాడు. రషీద్ ఖాన్, ఉమేష్ యాదవ్, మోహిత్ శర్మలకు ఒక్కో వికెట్ దక్కింది.
అయితే ఈ మ్యాచ్ ఇద్దరు ఆటగాళ్లకు కీలక మ్యాచ్ గా మిగిలిపోనుంది. యుజ్వేంద్ర చాహల్ కి ఇది 150వ ఐపీఎల్ మ్యాచ్ కాగా కెప్టెన్ సంజూ శాంసన్ 50వ మ్యాచ్ ఆడుతున్నాడు. అయితే జైపూర్ లో వర్షం కురవడంతో రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఐపీఎల్ మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైంది.
We’re now on WhatsApp. Click to Join
గుజరాత్ టైటాన్స్ : మాథ్యూ వేడ్ , శుభమన్ గిల్ , సాయి సుదర్శన్, విజయ్ శంకర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, ఉమేష్ యాదవ్, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్
రాజస్థాన్ రాయల్స్ : యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ , రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, రవిచంద్రన్ అశ్విన్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, కుల్దీప్ సేన్
Also Read: Vemireddy Prabhakar Reddy : ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రావడం ఖాయం..!