HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Rcb Vs Kkr Head To Head In Ipl Records Stats Results

RCB vs KKR: ఆర్సీబీ వ‌ర్సెస్ కేకేఆర్‌.. ఈడెన్ గార్డెన్స్‌లో ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారో?

కొత్త కెప్టెన్ అజింక్యా రహానే నేతృత్వంలో కోల్‌కతా నైట్ రైడర్స్ రంగంలోకి దిగనుంది. అదే సమయంలో ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కమాండ్ యువ బ్యాట్స్‌మెన్ రజత్ పాటిదార్ చేతికి అప్ప‌గించారు. చూడ‌టానికి రెండు జట్లు చాలా బలంగా కనిపిస్తున్నాయి.

  • Author : Gopi Date : 19-03-2025 - 11:10 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
RCB vs KKR
RCB vs KKR

RCB vs KKR: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్‌తో ఆర్సీబీ (RCB vs KKR) తలపడనుంది. కొత్త కెప్టెన్ అజింక్యా రహానే నేతృత్వంలో కోల్‌కతా నైట్ రైడర్స్ రంగంలోకి దిగనుంది. అదే సమయంలో ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కమాండ్ యువ బ్యాట్స్‌మెన్ రజత్ పాటిదార్ చేతికి అప్ప‌గించారు. చూడ‌టానికి రెండు జట్లు చాలా బలంగా కనిపిస్తున్నాయి. కోల్‌కతా స్టార్ ఆటగాళ్లతో నిండి ఉంది. RCB కూడా మెగా వేలంలో బలహీనమైన బౌలింగ్ దాడిని బలోపేతం చేసింది.

ఈడెన్ గార్డెన్స్ పిచ్ ఎలా ఉంటుంది?

ఈడెన్ గార్డెన్స్ మైదానంలో కోల్‌కతా, ఆర్‌సీబీ మధ్య ఉత్కంఠ మ్యాచ్ జరగనుంది. ఈడెన్ గార్డెన్స్‌లో బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం చెలాయిస్తారని గ‌ణంకాలు చెబుతున్నాయి. ఫోర్లు, సిక్సర్ల వర్షం కుర‌వ‌నుంది. ఫాస్ట్ అవుట్ ఫీల్డ్ కారణంగా బ్యాట్స్ మెన్ బంతిని బౌండరీకి ​​చేర్చేందుకు పెద్దగా శ్రమించాల్సిన పనిలేదు. మైదానంలో మంచి బౌన్స్ కారణంగా.. బంతి బ్యాట్‌కు అనుకూలంగా వ‌స్తుంది. అయితే ఆరంభంలో పిచ్‌లో తేమ కారణంగా ఫాస్ట్ బౌలర్లు కూడా రాణించే అవ‌కాశం ఉంది.

Also Read: Astronauts Shower: వ్యోమగాములు అంతరిక్షంలో స్నానం చేస్తారా? భోజ‌నం ఎలా చేస్తారో తెలుసా?

గణాంకాలు ఏం చెబుతున్నాయి?

ఐపీఎల్‌లో ఇప్పటివరకు ఈడెన్ గార్డెన్స్ మొత్తం 93 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు 38 సార్లు గెలిచింది. ఇదే సమయంలో ఛేజింగ్ చేసిన‌ జట్టు 55 మ్యాచ్‌లలో గెలిచింది. అంటే టాస్ గెలిచిన తర్వాత ముందుగా బౌలింగ్ చేయాలనే నిర్ణయం ఈ మైదానంలో మరింత ప్రయోజనకరంగా మార‌నుంది. కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసిన పంజాబ్ కింగ్స్ పేరిట ఈడెన్ గార్డెన్స్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసింది. అదే సమయంలో RCB జట్టు 49 పరుగులకే ఆలౌట్ కూడా అయింది. ఈడెన్ గార్డెన్స్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సగటు స్కోరు 163 పరుగులు.

హెడ్ టూ హెడ్‌

ఐపీఎల్‌లో ఇప్పటి వరకు ఆర్సీబీ, కోల్‌కతా నైట్ రైడర్స్ మొత్తం 34 సార్లు తలపడ్డాయి. వీటిలో కేకేఆర్ 20 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 14 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. IPL 2024లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో KKR రెండు మ్యాచ్‌లలో RCBని ఓడించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Eden Gardens
  • Head to Head
  • IPL 2025
  • IPL News
  • KKR
  • kolkata
  • rcb
  • RCB vs KKR

Related News

Prime accused in 11-year-old girl's rape and murder case killed in police encounter.

Police Encounter: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్‌

పశ్చిమ బెంగాల్‌లోని బరుయిపూర్‌లో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం మరియు హత్య కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాస్ మోండల్, నేర జరిగిన తీరును పునర్నిర్మించేందుకు తీసుకెళ్తుండగా బుధవారం జరిగిన పోలీసు ఎన్‌కౌంటర్‌లో కాల్పుల్లో మరణించాడు. పోలీసుల వివరాల ప్రకారం, బరుయిపూర్ పోలీస్ స్టేషన్ దర్యాప్తు అధికారి మరియు ఇతర పోలీసుల బృందం నిందితుడు ప్రభాస్ మోండల్‌తో కలిసి అర్ధరాత్రి 12:45 గంటల

    Latest News

    • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

    • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

    • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

    • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

    • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

    Trending News

      • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

      • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd