Ravi Shastri: బుమ్రాకు రెస్ట్ ఎందుకు? కోచ్ గంభీర్‌పై రవిశాస్త్రి ఫైర్
రెస్ట్ తీసుకునే విషయంలో ఆటగాడికి అవకాశం ఇవ్వొద్దని సూచించాడు. ప్లేయర్ కు విశ్రాంతి ఇవ్వాలా వద్దా అన్నది కోచ్ , కెప్టెన్ కలిసి నిర్ణయం తీసుకోవాలని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.
- By Gopichand Published Date - 11:44 PM, Wed - 2 July 25

Ravi Shastri: ఇంగ్లాండ్ తో రెండో టెస్టు కోసం భారత తుది జట్టులో మూడు మార్పులు జరిగాయి. ఊహించినట్టుగానే స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇచ్చారు. బుమ్రా స్థానంలో ఆకాశ్ దీప్ జట్టులోకి వచ్చాడు. అలాగే శార్థూల్ ఠాకూర్, సాయిసుదర్శన్ ను తప్పించి నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సందర్ ను తీసుకున్నారు. అయితే బుమ్రాను తప్పించడంపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. సిరీస్ లో వెనుకబడకుండా మ్యాచ్ గెలవాల్సిన టైమ్ లో అతన్ని కూర్చోబెట్టడం సరికాదని ఫైర్ అవుతున్నారు. తాజాగా భారత తుది జట్టు కూర్పుపై మాజీ క్రికెటర్ రవిశాస్త్రి (Ravi Shastri) అసహనం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా బుమ్రాకు ఎందుకు రెస్ట్ ఇచ్చారో అర్థం కావడం లేదన్నాడు. వారం రోజుల బ్రేక్ తర్వాత మ్యాచ్ జరుగుతున్నా కూడా రెస్ట్ ఇవ్వడం ఏంటో టీమ్ మేనేజ్ మెంట్ కే తెలియాలని వ్యాఖ్యానించాడు.
అయినా రెస్ట్ తీసుకునే విషయంలో ఆటగాడికి అవకాశం ఇవ్వొద్దని సూచించాడు. ప్లేయర్ కు విశ్రాంతి ఇవ్వాలా వద్దా అన్నది కోచ్ , కెప్టెన్ కలిసి నిర్ణయం తీసుకోవాలని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. వరల్డ్ క్లాస్ బౌలర్ ను ఇలా పక్కన పెడతారా అంటూ సెటైర్లు వేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ చివరి టెస్టులో గాయపడిన బుమ్రా తర్వాత రెండు నెలల పాటు ఆటకు దూరమయ్యాడు.
Also Read: Dalai Lama: టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా దగ్గర ఎంత డబ్బు ఉందో తెలుసా?
ఐపీఎల్ లో రీఎంట్రీ ఇచ్చిన ఈ స్టార్ పేసర్ లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆడాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసినప్పటకీ… మిగిలిన బౌలర్ల నుంచి సపోర్ట్ దక్కలేదు. ఫలితంగా తొలి టెస్టులో భారత్ ఓడిపోయింది. ఇప్పుడు రెండో టెస్టుకు వర్క్ లోడ్ పేరుతో బుమ్రాకు రెస్ట్ ఇవ్వడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. కానీ ఈ సిరీస్ ఆరంభానికి ముందే బుమ్రా ఏవైనా మూడు మ్యాచ్ లు మాత్రమే ఆడతాడని కోచ్ గంభీర్ , చీఫ్ సెలక్టర్ అగార్కర్ స్పష్టం చేశారు. లార్డ్స్ వేదికగా జరిగే మూడో టెస్టులో బుమ్రా బరిలోకి దిగుతాడని తెలుస్తోంది. ఆ తర్వాత మిగిలిన రెండు టెస్టుల్లో ఏదో ఒక మ్యాచ్ మాత్రమే ఆడనున్నాడు.