HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Rajeev Shukla On Pay Hike For Women Domestic Cricketers

మహిళా డొమెస్టిక్ క్రికెటర్లకు భారీగా పెరిగిన ఫీజులు!

బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా నేతృత్వంలో మహిళా క్రికెట్ రూపురేఖలు మారాయి. అంతర్జాతీయ స్థాయిలో పురుషులు, మహిళా క్రికెటర్లకు సమాన మ్యాచ్ ఫీజును అందించే 'పే ఈక్విటీ' విధానాన్ని అమలు చేశారు.

  • Author : Gopi Date : 23-12-2025 - 10:16 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Who is Team India's new T20 captain?
Who is Team India's new T20 captain?

Domestic Cricketers: మహిళా డొమెస్టిక్ క్రికెటర్ల వేతనాలను పెంచుతూ బీసీసీఐ (BCCI) తీసుకున్న నిర్ణయాన్ని బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ప్రశంసించారు. ఈ నిర్ణయం వల్ల మరింత మంది అమ్మాయిలు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంటారని, దేశంలో మహిళా క్రికెట్ ప్రమాణాలు మెరుగుపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

భారీగా పెరిగిన ఫీజులు

రోజుకు రూ. 50,000 వేతనం మహిళా డొమెస్టిక్ క్రికెటర్ల పేమెంట్ స్ట్రక్చర్‌లో బీసీసీఐ విప్లవాత్మక మార్పులు చేసింది. ఇప్పటివరకు రోజుకు రూ. 20,000గా ఉన్న మ్యాచ్ ఫీజును ఏకంగా రూ. 50,000కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

రిజర్వ్ ఆటగాళ్లకు కూడా ఊరట

తుది జట్టులో ఉండి ఆడని రిజర్వ్ ప్లేయర్ల ఫీజును రోజుకు రూ. 10,000 నుండి రూ. 25,000 కు పెంచారు. ఇది దాదాపు 100 శాతానికి పైగా పెరుగుదల అని రాజీవ్ శుక్లా పేర్కొన్నారు.

Also Read: మెగాస్టార్ స్టైలిష్ లుక్‌.. ఆకట్టుకుంటున్న కొత్త పోస్టర్!

వరల్డ్ కప్ విజయమే ప్రేరణ

2025 ఐసీసీ మహిళా వన్డే వరల్డ్ కప్‌లో భారత్ విజేతగా నిలవడమే ఈ భారీ వేతన పెంపునకు ప్రధాన కారణం. టీమ్ ఇండియా తొలిసారి వరల్డ్ ఛాంపియన్‌గా అవతరించడం వల్ల దేశంలో మహిళా క్రికెట్‌కు విపరీతమైన క్రేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలో బోర్డు ఈ సానుకూల నిర్ణయం తీసుకుంది.

జై షా హయాంలో కీలక సంస్కరణలు

బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా నేతృత్వంలో మహిళా క్రికెట్ రూపురేఖలు మారాయి. అంతర్జాతీయ స్థాయిలో పురుషులు, మహిళా క్రికెటర్లకు సమాన మ్యాచ్ ఫీజును అందించే ‘పే ఈక్విటీ’ విధానాన్ని అమలు చేశారు. డబ్ల్యూపీఎల్ ప్రారంభం మహిళా క్రికెటర్లకు ఆర్థికంగా స్థిరత్వాన్ని ఇవ్వడమే కాకుండా ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో పోటీపడే అవకాశాన్ని కల్పించింది. అట్టడుగు స్థాయి నుండి మహిళా క్రికెట్‌ను బలోపేతం చేసేందుకు భారీగా పెట్టుబడులు పెట్టారు. ఈ నిర్ణయం వల్ల భారత మహిళా క్రికెటర్లకు తగిన గుర్తింపు, గౌరవం లభిస్తుందని, భవిష్యత్తులో భారత్ మహిళా క్రికెట్‌లో తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని బోర్డు ప్రతినిధులు నమ్ముతున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BCCI
  • Domestic Cricketers
  • jay shah
  • Rajeev Shukla
  • sports news
  • women cricket

Related News

    Latest News

    • TDP : టీడీపీ చూపిన బాటలో దేశ రాజకీయాలు మారబోతున్నాయి: ఎమ్మెల్యే మాధవిరెడ్డి

    • T- SAT : ALP అభ్యర్థులకు గుడ్ న్యూస్.. టి-సాట్‌లో ప్ర‌త్యేక త‌ర‌గ‌తులు

    • CM Revanth Reddy : ప్రజల భద్రతే లక్ష్యం.. కఠిన నిర్ణయాలతో ముందుకు సాగుతున్న రేవంత్ స‌ర్కార్‌

    • HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

    • BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd