Ind vs SA: గువాహటి టెస్ట్‌కు రబడా ఔట్
ప్రెస్ మీట్‌లో బవుమా మాట్లాడుతూ రబడా గాయం ఇంకా నయం కాలేదని, ఈ దశలో రిస్క్ తీసుకోవడం సరైంది కాదని మెడికల్ టీమ్ క్లియర్‌గా చెప్పిందన్నారు.
- By Dinesh Akula Published Date - 09:00 PM, Fri - 21 November 25
గువాహటి: భారత్–దక్షిణాఫ్రికా రెండో టెస్టు (Second Test) కు ముందు సఫారీ జట్టుకు భారీ ఎదురుదెబ్బ (Major Setback) తగిలింది. స్టార్ పేసర్ కగిసో రబడా (Kagiso Rabada) గాయం (Injury) కారణంగా గువాహటి టెస్టు నుంచి తప్పుకున్నాడు. కోల్‌కతా టెస్టు ముందు నెట్ సెషన్‌లో జరిగిన గాయంతో ఇప్పటికే తొలి మ్యాచ్‌కు దూరమైన రబడా, రెండో టెస్టుకు అందుబాటులో ఉండడంలేదని Proteas కెప్టెన్ టెంబా బవుమా అధికారికంగా వెల్లడించారు.
ప్రెస్ మీట్‌లో బవుమా మాట్లాడుతూ రబడా గాయం ఇంకా నయం కాలేదని, ఈ దశలో రిస్క్ తీసుకోవడం సరైంది కాదని మెడికల్ టీమ్ క్లియర్‌గా చెప్పిందన్నారు. రబడా లేకున్నా తొలి టెస్టులో సౌతాఫ్రికా 30 పరుగుల తేడాతో గెలిచినా, కీలకమైన రెండో టెస్టు ముందు ఆయన దూరమవడం జట్టుకు నష్టమని తెలిపారు.
గువాహటి టెస్ట్ తొలి మ్యాచ్ కావడంతో పిచ్ ప్రవర్తనపై కూడా ఆసక్తి నెలకొంది. బవుమా ప్రకారం, తొలి రెండు రోజులు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత స్పిన్నర్లు మ్యాచ్‌ను ప్రభావితం చేయవచ్చని అంచనా వేశారు. ఉదయం మరోసారి పిచ్ పరిశీలించి రబడా స్థానంలో ఎవరిని తీసుకోవాలో నిర్ణయిస్తామని చెప్పారు. మొదటి రోజుల్లో పేస్, బౌన్స్ సహకరించవచ్చని కానీ మూడో రోజుకి స్లో టర్న్ కనిపించవచ్చని అభిప్రాయపడ్డారు.
ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. గువాహటిలో పూర్తిగా కొత్త పరిస్థితుల్లో రెండు జట్లు తలపడనుండటంతో మ్యాచ్‌పై ఉత్కంఠ పెరిగింది.