HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >Punjab Kings Beat Chennai Super Kings By 7 Wickets

CSK vs PBKS: చెపాక్ లో చెన్నైని ఓడించిన పంజాబ్

చెన్నై చెపాక్ లో రుతురాజ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ కు పంజాబ్ షాక్ ఇచ్చింది. స్వల్ప ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు రాణించడంతో విజయం పంజాబ్ సొంతమైంది. ఈ మ్యాచ్ ద్వారా పంజాబ్ పాయింట్ల పట్టికను మెరుగుపరుచుకుని ముందుకు ఎగబాకింది.

  • Author : Vamsi Chowdary Korata Date : 01-05-2024 - 11:57 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CSK vs PBKS
CSK vs PBKS

CSK vs PBKS: చెన్నై చెపాక్ లో రుతురాజ్ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ కు పంజాబ్ షాక్ ఇచ్చింది. స్వల్ప ఛేదనలో పంజాబ్ బ్యాటర్లు రాణించడంతో విజయం పంజాబ్ సొంతమైంది. ఈ మ్యాచ్ ద్వారా పంజాబ్ పాయింట్ల పట్టికను మెరుగుపరుచుకుని ముందుకు ఎగబాకింది.

ఐపీఎల్ 49వ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ మరియు పంజాబ్ కింగ్స్ మధ్య జరిగింది. పంజాబ్ తన సొంతగడ్డపై చెన్నైని 7 వికెట్ల తేడాతో ఓడించింది. పంజాబ్ ఈ విజయంతో ప్లేఆఫ్ రేసులో ఉత్కంఠ పెరిగింది. లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్‌కు సరైన ఆరంభం లభించలేదు. 13 పరుగుల వద్ద ప్రభసిమ్రన్ ఔటయ్యాడు. దీని తర్వాత రిలే రూసో మరియు జానీ బెయిర్‌స్టో జట్టు బాధ్యతను తీసుకున్నారు. ఇద్దరూ జాగ్రత్తగా ఆడుతూ జట్టును 100 పరుగుల మార్క్ కు చేర్చారు. బెయిర్‌స్టో 46 పరుగులు, రిలే రూసో 43 పరుగులు చేసి అవుటయ్యారు. అనంతరం కెప్టెన్ సామ్ కుర్రాన్ (26 నాటౌట్), శశాంక్ సింగ్ (25 నాటౌట్) రాణించడంతో పంజాబ్ 17.5 ఓవర్లలో 163 పరుగులతో విజయం సాధించింది.

We’re now on WhatsApp. Click to Join

తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్‌తో పంజాబ్ కింగ్స్‌కు 163 పరుగుల లక్ష్యాన్ని అందించింది. రుతురాజ్ 48 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేశాడు. గైక్వాడ్ క్రీజులో ఉన్నంత సేపు చెన్నై స్కోరు పరుగులు పెట్టింది. అయితే గైక్వాడ్ అవుట్ కాగానే స్కోర్ నెమ్మదించింది. శివమ్ దూబే (0) రవీంద్ర జడేజా (2) సమీర్ రిజ్వీ 21, మొయిన్ అలీ 15, ధోనీ 14 పరుగులు చేశారు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్ ప్రీత్ బ్రార్ 2, రాహుల్ చహర్ 2, కగిసో రబాడా 1, అర్షదీప్ సింగ్ 1 వికెట్ తీశారు. కాగా చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది.

Also Read: Big Relief to Janasena : ఊపిరి పీల్చుకున్న జనసేన..ఇక ఆ టెన్షన్ అవసరం లేదు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 7 wickets
  • CSK vs PBKS
  • Highlights
  • ipl 2024
  • Live Score
  • punjab kings
  • Ruturaj Gaikwad
  • Sam Curran

Related News

Pulled back the catch Shreyas Iyer

Shreyas Iyer: శ్రేయాస్ అయ్యర్ స్టన్నింగ్ క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పింది.

వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య గురువారం జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ పట్టిన అద్భుతమైన క్యాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ క్యాచ్ చూసి ముంబై ఇండియన్స్ డగౌట్‌లో ఉన్న రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ నోరెళ్లబెట్టారు. దీన్ని ఈ ‘సీజన్ బెస్ట్ క్యాచ్’గా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్ సందర్భంగా 18వ ఓ

  • Pbks Wn

    IPL 2026 -MI vs PBKS : ముంబై కి మరో ఓటమి !!

  • Ruturaj Gaikwad

    సీఎస్కే కెప్టెన్ పేల‌వ ఫామ్‌.. చెత్త షాట్‌తో ఔట్‌!

Latest News

  • నేడు ర‌స‌వ‌త్త‌ర పోరు.. స‌న్‌రైజ‌ర్స్ విజ‌యాల‌కు ఢిల్లీ బ్రేక్ వేయ‌గ‌ల‌దా?

  • IPL: ‘పవర్’ప్లే లో ఎక్కువ సిక్సర్లు బాదిన ప్లేయర్లు వీరే..!!

  • Cake : వామ్మో ఒక్క కేక్ తయారీకి 3,500 గంటల సమయం!

  • ప్రధాని మోదీకి ఉల్లిపాయలు ఇష్టమేనా?

  • KCR సభపై కవిత దారుణమైన కామెంట్స్

Trending News

    • అమెరికా-ఇరాన్ మధ్య రేపే రెండో రౌండ్ చర్చలు.. రంగంలోకి ట్రంప్?

    • పాత ఉద్యోగం పోయె.. కొత్త ఆఫర్ వెనక్కి తీసుకెళ్లె! సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆవేదన

    • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd