Big Relief to Janasena : ఊపిరి పీల్చుకున్న జనసేన..ఇక ఆ టెన్షన్ అవసరం లేదు
జనసేన పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానాల్లో, అలాగే జనసేన పోటీలో ఉన్న లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో గాజు గ్లాసు గుర్తును జనసేనకే కేటాయిస్తున్నామని, స్వతంత్రులకు ఇవ్వడం లేదని ఈసీ తన నివేదికలో స్పష్టం చేసింది
- By Sudheer Published Date - 09:32 PM, Wed - 1 May 24

గత పది రోజులుగా జనసేన పార్టీ (Janasena Party) టెన్షన్లో పడింది..అదేంటి అంటే..ఈసారి జనసేన పార్టీ కూటమి పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ , 2 లోక్ సభ స్థానాలకు పోటీ పడుతుంది. ఈ క్రమంలో జనసేన పార్టీకి చెందిన గాజు గ్లాసు గుర్తు (Janasena Glass Symbol)ను ఈసీ ఫ్రీ సింబల్ కేటగిరీలో చేర్చి.. అధికారులు పలుచోట్ల ఈ గుర్తును స్వతంత్రులకు కేటాయించారు. అయితే రిటర్నింగ్ అధికారుల నిర్ణయంపై జనసేన కోర్టును ఆశ్రయించింది.
We’re now on WhatsApp. Click to Join.
ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కోర్టుకు నివేదిక సమర్పించింది. జనసేన పోటీ చేస్తున్న అసెంబ్లీ స్థానాల్లో, అలాగే జనసేన పోటీలో ఉన్న లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో గాజు గ్లాసు గుర్తును జనసేనకే కేటాయిస్తున్నామని, స్వతంత్రులకు ఇవ్వడం లేదని ఈసీ తన నివేదికలో స్పష్టం చేసింది. దీంతో కోర్టు ఈ పిటిషన్ కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఈ 13 లోక్ సభ స్థానాల పరిధిలో జనసేనకు అలాగే కూటమి పార్టీలకు రిలీఫ్ లభించనుంది. ఈ 13 లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో ఉన్న 21 ఎమ్మెల్యే స్థానాలలో జనసేన పోటీ చేస్తోంది. ఈ కారణంతో జనసేన పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్న 13 ఎంపీ స్థానాలలో ఈసీ గాజు గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించకుండా ఫ్రీజ్ చేసింది.
గాజు గ్లాసును ఫ్రీజ్ చేసిన ఈ జాబితాలో విజయనగరం, అరకు, విశాఖపట్నం, అనకాపల్లి, రాజమండ్రి, రాజంపేట, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, తిరుపతి, కాకినాడ, అమలాపురం, నరసాపురం లోక్ సభ నియోజకవర్గాలు ఉన్నాయి. గాజు గ్లాసు గుర్తును ఫ్రీజ్ చేయడానికి సంబంధించి ఆర్వోలకు ఆదేశాలు జారీ చేసిన ఎన్నికల సంఘం.. ఇప్పటికే కేటాయించిన చోట గుర్తులు మార్చాలని సూచించింది. ఇక కోర్ట్ ఆదేశాలతో జనసేన హ్యాపీగా ఫీల్ అవుతుంది.
Read Also : Janasena : మావయ్య కోసం రంగంలోకి దిగిన మెగా మేనల్లుడు